వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం 85 శాతం ప్రసవాలు జరగాలి ……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం 85 శాతం ప్రసవాలు జరగాలి
……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం 85 శాతం ప్రసవాలు జరగాలని, అన్ని సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు.

గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా ఆస్పత్రులకు సంబంధించి మంజూరైన పనులు, ఆయా నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పీహెచ్సీలు , బస్తీ దవాఖానాలు, డయాలసిస్ సెంటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శంకుస్థాపనలు చేయాల్సిన వాటి వివరాలు, ఆయా ఏరియా ఆసుపత్రులకు, పీహెచ్సీలలో కావాల్సిన ఎక్విప్మెంట్, మరమ్మతులకు సంబంధించిన వివరాలను ఆరా తీసారు. ఈ నెలాఖరులోగా ఆయా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

పూర్తయిన పీహెచ్సీ భవనాలను, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. టెండర్ స్టేజీలో ఉన్న పనులకు వెంటనే టెండర్లు పిలవాలని తెలిపారు. ఆసుపత్రులకు కావలసిన ఎక్విప్మెంట్ ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం 85 శాతం ప్రసవాలు జరిగేలా ఆయా డాక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని సూచించారు.

అన్ని ఆసుపత్రులకు సంబంధించి 15 రోజులకు ఒక సారి ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని, అదేవిధంగా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని
డి సి హెచ్ ఎస్ సంగారెడ్డి కి సూచించారు.

ఈ సమీక్షలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గాయత్రీ దేవి, జి జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ అనిల్ కుమార్, డి సి హెచ్ ఎస్ డా. సంగారెడ్డి, ఏరియా ఆసుపత్రుల సూపరిండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post