*వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, జనవరి 07: కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 ఉధృతి దృష్ట్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకై 270 సర్వీలెన్స్ టీములను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 255 గ్రామ స్థాయి, 13 మండల స్థాయి, 2 జిల్లా స్థాయి టీములు ఉన్నాయన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించడం, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేయడం చేయాలన్నారు. పాజిటివ్ కేసులు ఖచ్చితంగా ఐసులేషన్ లో ఉండేలా చూడాలన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు వారం రోజులు ఐసులేషన్ లో ఉంచాలని, 8వ రోజు నియమ నిబంధనల మేరకు పరీక్షలు చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో ఇప్పటికి 32 వేల 399 కోవిడ్-19, 4 ఓమెక్రాన్ పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. ఇప్పటికి 5,92,298 రాపిడ్, 28,433 ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశామన్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆక్సిజన్ ఏజన్సీల తనిఖీ, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించాలన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమీక్షలో ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post