వైద్య ఆరోగ్య శాఖ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు


100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:: రాష్ట్ర ఆర్థిక మరియువైద్యారొగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు
100% వ్యాక్సిన్ పూర్తి చేసిన గ్రామాలను ప్రకటించాలి
3.45 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
వైద్యారొగ్య శాఖ పనితీరులో పారదర్శకత పెంపొందించాలి
పెండింగ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రతి వారం వైద్యారొగ్య శాఖ పనితీరు పై కలెక్టర్లు సంపూర్ణంగా రివ్యూ నిర్వహించాలి
ప్రణాళికాబ్దదంగా అందుబాటులో ఉన్న మానవ వనరులను సంపూర్ణంగా వినియోగించాలి
రానున్న విద్యాసంవత్సరానికి 8 నూతన మెడికల్ కళాశాలలను సిద్దం చేయాలి
కరోనా వ్యాక్సినేషన్, వైద్యారొగ్య శాఖ పనితీరు, నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు వంటి అంశాల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన రాష్ట్ర వైద్యరొగ్య శాఖ మంత్రి
పెద్దపల్లి , నవంబర్ 13 :-.
రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన 100% జనాలకు వ్యాక్సినేషన్ మొదటి డోసు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యారొగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైద్యారొగ్య శాఖ పనితీరు, నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు వంటి అంశాల పై జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో 3.45 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో 3500 వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో 264 వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రైవెట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో మొదటి కోటి డోసుల వ్యాక్సినేషన్ కు 178 రోజుల సమయం పట్టిందని, రెండవ కోటి వ్యాక్సిన్ డోసులను 78 రోజులో అందించామని, మూడో కోటి డోసులను 27 రోజులలో అందించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.77 కోట్ల మందికి వ్యాక్సినేషన్ 2 డోసులు అందించాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు 2.35 కోట్ల మొదటి డోసు, 1.09 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సినేషన్ అందించామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 85% మొదటి డోసు, 39% రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసామని వివరించారు. 100% మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామాలు , మండలాలను ప్రకటించాలని మంత్రి ఆదేశించారు వికారాబాద్, జోగులాంబ గద్వాల, వరంగల్, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ అధికంగా పెండింగ్ ఉందని, వీరు ప్రత్యేక శ్రద్ద కనబర్చీ పూర్తి చేయాలని, ప్రజలలో అవగాహన పెంపొందించాలని, కలెక్టర్లు వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించాలని మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మొదటి డోసు విజయవంతంగా అందించినప్పటికి 2వ డోసు చాలా పెండింగ్ లో ఉందని, వీరు జీహెచ్ఎంసి కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ 2వ డోసు పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు అనంతరం మంత్రి జిల్లాల వారిగా వ్యాక్సినేషన్ స్థితిగతుల పై రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర ప్రబుత్వం వైద్యాశాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తందని, ముఖ్యమంత్రి కేసిఆర్ సాధారణ బడ్జెట్ కు అదనంగా వైద్య శాఖ కు 10వేల కోట్ల అదనపు నిధులు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నారని మంత్రి తెలిపారు. వైద్యారొగ్య శాఖ లో పారదర్శకత, జవాబుదారితనం పెరిగే విధంగా అధికారులు పనిచేయాలని, ప్రతి వారం కలెక్టర్లు వైద్యారొగ్య శాఖ పనితీరు పై రివ్యూ నిర్వహించాలని మంత్రి సూచించారు జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా కలెక్టర్లు తనిఖీ చెయాలని, రిజిస్టర్లను పరిశీలించాలని మంత్రి సూచించారు. జిల్లాలో వైద్యశాఖలో ఉన్న ఖాళిలను పూర్తి స్థాయిలో భర్తీ చెసేందుకు కలెక్టర్లకు సంపూర్ణ అధికారాన్ని సీఎం అందించారని, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో వివిధ నిధుల కింద మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ స్థితిగతుల పైకలెక్టర్లు రివ్యూ నిర్వహించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అధిక ఖర్చు వ్యయం చేసి అందుబాటులొకి తెచ్చిన యంత్రాల పనితీరు పరిశీలించాలని, అవసరమైన చోట చిన్న చిన్న మరమ్మత్తులను అందుబాటులో ఉన్న నిధులతో పూర్తి చెయాలని మంత్రి తెలిపారు జిల్లా ఆసుపత్రి అభివృద్ది సమావేశంలో కలెక్టర్లు తప్పనిసరిగా పాల్గోనాలని మంత్రి పేర్కోన్నారు. ప్రభుత్వం పేదల కోసం గతంలో లేనివిధంగా డయాలసీస్ కెంద్రాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసిందని, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, 21 జిల్లా కేంద్రాలో ప్రభుత్వం డయాగ్నేస్టీక్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిలో ప్రజలకు ఉచితంగా వైద్య పరిక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీని పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులు కొంత శాతం నెల రోజులకు ఒక ఆపరేషన్ సైతం చెయడం లేదని, వీటి పరిస్థితులో మార్పు తీసుకొని రావాలని మంత్రి తెలిపారు. జిల్లాలో అందుబాటులొ ఉన్న స్పెషలిస్టు వైద్యుల పనితీరు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట వారి సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. మానవ వనరులను విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని, వైద్యులు ఆసుపత్రులలో సకాలంలో అందుబాటులొ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలో ఓపీల సంఖ్య పెరగాలని మంత్రి పేర్కోన్నారు. కమ్యూనిటి ఆసుపత్రులలో 9 నుంచి మధ్యాహ్నం 2, సాయంత్రం 4 నుంచి 6 వరకు ప్రత్యేక వైద్యులు అందుబాటులొ ఉండాలని మంత్రి తెలిపారు. ఆరొగ్యశ్రీలో 946 శస్త్రచికిత్సలు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రులో నిర్వహిస్తామని, వీటికి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 శస్త్రచికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహించే అవకాశం ఉందని, దీని పై రివ్యూ నిర్వహించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ సామర్థ్యం , వాటి వినియోగం పరిశీలించాలని, ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరొగ్య శ్రీ కేసులు అధికంగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆరొగ్య శ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, వీటి కోసం ఆసుపత్రి నిధులు, ఆరొగ్య శ్రీ నిధులు, కలెక్టర్ల వద్ద ఉన్న నిధులున వినియోగించాలని మంత్రి ఆదేశించారు ఆసుపత్రులలో పారిశుద్ద్య నిర్వహణ, భోజన నాణ్యతను కలెక్టర్లు నేరుగా పరిశీలించాలని మంత్రి పేర్కోన్నారు. జిల్లాలో ని ఆసుపత్రుల పారిశుద్ద్య కాంట్రాక్టర్లతో కలెక్టర్లకు రివ్యు ఏర్పాటు చేసి నిర్థేశించిన సంఖ్యలో పారిశుద్ద్య కార్మికులు విధులు నిర్వహించేలా చూడాలని, ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రికి సరఫరా చెసే భోజనాన్నీ ఆకస్మిక పర్యటనల సమయంలో కలెక్టర్లు తీసుకోవాలని, నాణ్యతను పరిశీలించాలని మంత్రి పేర్కోన్నారు జిల్లాలో ఆయుష్, హోమియోపతి, ఆయుర్వేదిక్ మొదలైన ఆసుపత్రి స్థితిగతుల పై నివేదిక తయారు చెయాలని, మల్లెరియా, లెప్రొసి, టిబి తదితర అంశాల పై సమాచారం సేకించాలని కలెక్టర్లకు మంత్రి తెలిపారు. జిల్లాలో కొన్ని జిల్లాలో ఆర్.బి.ఎస్.కె.ఈ కేంద్రాలు ఏర్పాటు చేసామని, వీటి పనితీరు రివ్యూ చెయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరొగ్య కెంద్రాలను, కమ్యూనిటి ఆసుపత్రులను జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి తనిఖీ చేయాలని, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ DCHS తనిఖీ చేయాలని,,కలెక్టర్లు ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి మాసం వైద్యరొగ్య శాఖ పై వీసి నిర్వహించడం జరుగుతందని, ప్రతి మాసం జిల్లాలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి ఆశా వర్కర్ నుంచి మెడికల్ సూపరింటెండెంట్ వరకు అందరీ పనితీరు రివ్యూ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు జిల్లా పర్యటించే సమయంలో ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, వైద్యులు సకాలంలో అందుబబాటులో లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేసారు.
రాష్ట్రంలోని 8 జిల్లాలు సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, మహబుబాద్, జగిత్యాల, రామగుండం(పెద్దపల్లి), మంచిర్యాల జిల్లాలో నూతన మెడికల్ కళాశాలలు వచ్చే విద్యాసంవత్సరం క్లాస్ లు ఆరంభించేలా చర్యలు తీసుకోవాలన కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి వచ్చీ పరిశీలన చేస్తుందని, అప్పటికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చెయాలని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి జిల్లాల వారిగా నూతన మెడికల్ కళాశాల ఎర్పాటుకు జరుగుతున్న పనితీరును రివ్యూ చేసి అధికారులకు పలు సూచనలు చెసారు. మెడికల్ కౌన్సిల్ పర్యటనకు ముందు టీచింగ్ ఆసుపత్రులను , మొదటి తరగతులకు అవసరమైన కళాశాల భవనాన్ని సిద్దం చేయాలని, రాత్రింబవళ్లు పనిజరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్నతాధికారులను పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని మంత్రి పేర్కొన్నారు ప్రజలతో వైద్యశాఖ సిబ్బంది ప్రవర్తించే తీరులో మార్పు రావాలని, చిరునవ్వుతో రోగులకు వైద్యం చేయాలని మంత్రి సూచించారు.

 వీసిలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లుడతూ  మంత్రి సూచనలు నోట్ చేసుకున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  రామగుండం మెడికల్ కళాశాలకు సంబంధించి టీచింగ్ ఆసుపత్రి 45 రోజులో సిద్దం చేస్తామని, మెడికల్ కళాశాల భవన నిర్మాణ టెండర్లు ఫైనల్ చేస్తున్నామని తెలిపారు. వైద్య కళాశాలకు హస్టల్ పర్పాటు చేసే దిశగా సింగరేణీ 2 భవనాలు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వైద్య కళాశాల భవన నిర్మాణ టెండర్లు ఫైనల్ చెసి పనలు త్వరగా ప్రారంభించాలని మంత్రి సూచించారు.

 జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ జిల్లా అధికారి (DCHS) డాక్టర్ మందల వాసుదేవరెడ్డి,జిల్లా ఇమ్యూనైజేషన్ అదికారి కృపాబాయి, టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ ఆజ్మీర స్వామి, ఈఈ ఆర్ అండ్ బీ, సంబంధిత అధికారులు తదతరులు ఈ వీసిలో పాల్గోన్నారు.

Share This Post