ఈసందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో అవసరం అయితే ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు.
పీ.హెచ్.సీ. లో ఇక నుండి ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఖచ్చితంగా విధులు నిర్వహించాలని, లేనిచో చర్యలు తీసుకోవాలని కలెక్టరులను ఆదేశించారు, అలాగే ఇకనుండి గ్రామాల లోని ఆశల దగ్గరనుండి వైద్య అధికారుల వరకు అన్ని కార్యక్రమాలపై కలెక్టర్ గారు మరియు డీ.హెమ్.హెచ్.ఓ. గార్లు ప్రతి వారము సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
వైద్యాధికారులు, డిప్యూటీ డీ.హెమ్.హెచ్.ఓ.లు , పీ.ఓ. లు, డీ.హెమ్.హెచ్.ఓ.లు అందరు వారివారి ప్రాంతంలో గల పి హెచ్. సి ల ను సందర్శించి ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలను ముందు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి డోసు 79% రెండో డోస్ లో 28 శాతం మాత్రమే కవరేజ్ అయిందని, వందకు వందశాతం దిశగా ఆశా నుండి మొదలుకొని అధికారుల వరకు నిబద్ధతతో పని చేసి ప్రజలకు వాక్సిన్ ఇచ్చి కరోనా రాకుండా చూడాలని, అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంను కరానా రహిత ప్రాంతంగా మార్చాలని కోరారు.
ఇక నుండి తాను కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాను సందర్శించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ ఆస్పత్రులను, ఏరియా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ లను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.
ఇది మొట్టమొదటి సమీక్ష సమావేశం కాబట్టి ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవడం లేదని , అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయుటకు కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ ద్వారా ఇతర లైన్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం తీసుకొని కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమము 100% పూర్తి చేయాలని కోరారు.
అందరు వైద్యాధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమయం సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని కోరారు
పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది వారి సేవలను వినియోగించుకుని కోవిడ్ వ్యాక్సినేషన్ 100% అయినట్టుగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లను కోరారు.
డి ఎం హెచ్ వో లు కూడా నెలలో ప్రతి నెలలో ఒకటి లేదా రెండు సార్లు ఖచ్చితంగా సందర్శించి అక్కడికక్కడే సమావేశాలు ఏర్పాటు చేసి లోటుపాట్లను సవరించి అన్ని ఆరోగ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు సమయపాలన పాటిస్తూ, అన్ని రకాల శస్త్రచికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తాను ఆకస్మికంగా సందర్శన చేసిన సమయంలో బాత్ రూమ్ దగ్గర నుండి ఆపరేషన్ థియేటర్ వరకు అన్నీ సందర్శిస్తారని తెలిపారు.
సర్జన్లు ఉన్నప్పటికిని ఆసుపత్రిలో ఆపరేషన్ లు నిర్వహించడం లేదని, అందుకే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
ఇకనైనా వారు ప్రభుత్వ ఆసుపత్రులలో శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆదేశించేలా చూడాలని కలెక్టర్లను కోరారు.
కలెక్టర్లు మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని కోరారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ జాబితాలో 946 వ్యాధులు లకు గాను వైద్య చికిత్సలు అందజేస్తున్నారన్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద మరో 646 వ్యాధులను , మొత్తం కలిపి 1592 వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిని తొలగించడమే కాకుండా, విధులను సక్రమంగా నిర్వహించిన వారిని గుర్తించి వారికి ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు గారు వారి సమీక్ష సమావేశంలో తెలపడం జరిగినది .
హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఇందులో బాగంగా కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వీ.సీ.చాంబర్ లో జిల్లా కలెక్టర్ కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీఎంహెచ్ఓ డాక్టర్ కల్పన కాంటే ,డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ డీ.హెమ్
హెచ్మోలు, శోభారాణి, చంద్రశేఖర్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. చెక్ పోస్టుల, బస్టాండ్ల, వీక్లీ మార్కెట్ల వద్ద ఆరోగ్య కార్యకర్తలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేయిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు, గ్రామ సంఘాల మహిళలు వ్యాక్సినేషన్ చేయించుకొని వారిని గుర్తించి వారు వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ______ జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.