వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీష్ రావు ను కలిసిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీష్ రావు ను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నేడు సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు, వైద్య విద్యా శాఖ డైరెకర్ డా. రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి. గంగాధర్, కాళోజి నారాయణ రావు హెల్త్ యునివర్సిటీ వైస్ చాన్స్ లర్   డా. కరుణాకర్ రెడ్డి, టీ.ఎస్.ఎం.ఐ.డి.సి. ఎండి చంద్ర శేఖర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై స్వల్ప కాల సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు మంత్రిని పూల గుచ్చాలతో అభినందించారు.

Share This Post