వైద్య కళాశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి.

ప్రచురణార్థం

మహబూబాబాద్ జూలై 8.

జిల్లాలో వైద్య కళాశాల మంజూరు అయినందున మున్సిపాలిటీలోని తొర్రూర్ రోడ్డు సబ్ జైల్ ఎదురుగా జిల్లా పోలీస్ కార్యాలయం వెనుక వైద్య కళాశాలకు కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి గురువారం సందర్శించి పరిశీలించారు.

సుమారు 50 ఎకరాల్లో నిర్మించనున్న వైద్య కళాశాల స్థలం ను జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలిస్తూ రెవెన్యూ సర్వే అధికారులను సరిహద్దులను అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా స్థలాన్ని పరిశీలించారు అదేవిధంగా భూముల సరిహద్దులను రెవెన్యూ అధికారులు మ్యాపు ద్వారా తెలియజేశారు.

స్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకపోవడం విశాలంగా మైదాన పరంగా ఉండటం జాతీయ రహదారికి పక్కనే ఉండటం పట్టణానికి దగ్గరగా ఉండటంతో ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి కి కలెక్టర్ వివరిస్తూ ఈ ప్రాంతానికి రింగ్ రోడ్డు సౌకర్యం కూడా రానున్నదని తద్వారా పట్టణం అభివృద్ధి వేగంగా ఉండనున్నదని వైద్య కళాశాల నిర్మాణం గిరిజన ప్రజలకు వరం అన్నారు.

జిల్లాలో 50 శాతం గిరిజన ప్రాంతం కావడం తండాలు ఎక్కువగా ఉండటం నిరుపేదలకు ఎక్కువగా ఉపయోగపడనున్నదని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కలిపే విధంగా ఈ ప్రదేశం ఉన్నదని పేదలు వైద్య కళాశాలను వినియోగించుకునేందుకు ఎక్కువ అవకాశం ఉందన్నారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ కొమరయ్య సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు నరసింహ మూర్తి తాసిల్దార్ రంజిత్ కుమార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
—————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post