వైద్య కళాశాల స్థలాన్ని సందర్శించిన కలెక్టర్…

ప్రచురణార్థం

వైద్య కళాశాల స్థలాన్ని సందర్శించిన కలెక్టర్…

మహబూబాబాద్ సెప్టెంబర్ 9.

పట్టణంలోని తొర్రూరు రోడ్డు లో పోలీస్ కార్యాలయం వెనక ఉన్న మెడికల్ కళాశాల నిర్మాణం కొరకు కేటాయించిన స్థలాన్ని అదనపు కలెక్టర్ కొమరయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక గురువారం సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా వైద్య కళాశాల నిర్మించే ప్రాంతాన్ని కలెక్టర్ పర్యటించి పరిశీలించారు రెవెన్యూ సర్వే ఆర్ అండ్ బి అధికారుల తో కలిసి స్థలం మ్యాప్ను పరిశీలిస్తూ వివాదాలు లేనంతవరకూ ఉన్న భూమికి హద్దులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలన్నారు.

అలాగే ఏరియా హాస్పిటల్ కోఆర్డినేటర్ ను ఆదేశిస్తూ ప్రభుత్వ స్థలమని ఆక్రమిస్తే తగు చర్యలు తీసుకుంటామని తక్షణం బోర్డు ఏర్పాటు చేయలన్నారు. సదరు స్థలాన్ని వెంటనే స్వాధీన పరచుకోవాలన్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ ల కొరకు నిర్మిస్తున్న భవనాల నిర్మాణ పనులను ప్రక్కనే ఉన్న కేంద్ర విద్యాలయ స్థలాన్ని మ్యాపు ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
పనులు వేగవంతం చేయాలని నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కొమరయ్య ఏరియా హాస్పటల్ కోఆర్డినేటర్ వెంకట రాములు రోడ్లు భవనాల శాఖ అధికారులు తానేశ్వర్, డి ఈ రాజేందర్, తాసిల్దార్ రంజిత్ సర్వే అధికారులు భాస్కర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
—————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post