వైద్య శాఖ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్


ప్రణాళికబద్ధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
• వ్యాక్సినేషన్ పురోగతిపై గ్రామాల వారీగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి
• వైద్యారొగ్య శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంపొందించాలి

పెండింగ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలి
కరోనా వ్యాక్సినేషన్, వైద్యారొగ్య శాఖ పనితీరు, వంటి అంశాల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , నవంబర్
17:-. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైద్యారొగ్య శాఖ పనితీరు వంటి అంశాల పై బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోకలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 593164 మందికి వ్యాక్సినేషన్ అందించాల్సి ఉండగా ఇప్పటివరకు దాదాపు 4.75 లక్షల (81%) మందికి మొదటి డోసు, 1.10 (37%) లక్షల మందికి రెండో వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పురోగతి పై కలెక్టర్ పి.హెచ్.సి వారిగా రివ్యూ తీసుకున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల వివరాలు, వ్యాక్సినేషన్ తిరస్కరిస్తున్న వారి వివరాలను గ్రామాల వారిగా అందించాలని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తో పాటు వ్యాక్సినేషన్ పై సర్వే చేపడుతున్నారని, వీరితో ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 70 వేల మంది 2వ డోస్ వ్యాక్సినేషన్ సమయం గడిచినప్పటికీ పెండింగ్ ఉందని, దీని పూర్తి చేసేందుకు మెడికల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో కలుగుతున్న అవరోధాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అపోహల కారణంగా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం గమనించిన కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలంతా ముందుకు వచ్చి వ్యక్తిని తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు
ప్రభుత్వ వైద్య రంగం పై నమ్మకం కలిగే విధంగా మెడికల్ అధికారులు విధులు నిర్వహించాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు . ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలో ఓపీల సంఖ్య పెరగాలని పేర్కోన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ సామర్థ్యం , వాటి వినియోగం పరిశీలించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు సక్రమంగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, వీటి కోసం ఆసుపత్రి నిధులు, ఆరొగ్య శ్రీ నిధులు, ఆసుపత్రి వద్ద ఉన్న నిధులున వినియోగించాలని ఆదేశించారు ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఆసుపత్రులను జిల్లా స్థాయి అధికారుల నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వరకు ఎవరైనా ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, వైద్యులు సకాలంలో అందుబబాటులో లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసారు
ప్రజలతో వైద్యశాఖ సిబ్బంది ప్రవర్తించే తీరులో మార్పు రావాలని, చిరునవ్వుతో రోగులకు వైద్యం చేయాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అదికారి కృపాబాయి, మెడికల్ అధికారులు, సంబంధిత అధికారులు తదతరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు. .

Share This Post