వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 20: జిల్లాలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం లింగాల ఘనపూర్ మండల కేంద్రములోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందో అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ అనారోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సిబ్బంది హాజరు పట్టికను ఆయన పరీశిలించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి, వ్యాక్సిన్ తీసుకొనని వారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు జిల్లాలో త్వరలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు అన్ని శాఖల సమ్వయంతో చర్యలు చెపట్టడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎ. మహేందర్, తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post