వైన్ షాప్ ల కోసం 1467 దరఖాస్తులు
జిల్లా డిప్యూటీ కమిషనర్ కె ఎ బి శాస్త్రి
000000
కరీంనగర్ జిల్లా మొత్తం ఉన్నటువంటి 94 వైన్ షాపులకు గాను 09నవంబర్ నుండి గురువారం రాత్రి 7గంటల వరకు 1467 అప్లికేషన్స్ వచ్చాయని ఇంకా కొంత మంది దరఖాస్తుదారులు లైన్ లో వేచి ఉన్నారని , రాష్ట్ర ఎక్సైజ్ సంయుక్త కమిషనర్ మరియు కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్
కె.ఏ. బి శాస్త్రి తెలిపారు.
ఈ సందర్భంగా కె .ఏ.బి శాస్త్రి మాట్లాడుతూ గురువారం రోజు కరీంనగర్ అర్బన్ పరిధిలో 338 , కరీంనగర్ రూరల్ పరిధిలో 350,
జమ్మికుంట స్టేషన్ పరిధిలో 212,హుజురాబాద్ స్టేషన్ పరిధిలో 289 తిమ్మాపూర్ స్టేషన్ పరిధిలో 278 అప్లికేషన్స్ వచ్చాయని,నవంబర్ 20 శనివారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుందని అందరూ ఎంట్రీ పాస్ తీసుకొని డ్రా లో హాజరు కావాలని తెలిపారు