వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ….. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,


సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్అమోయ్ కుమార్, మాట్లాడుతూ 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించు టకు కార్యాచరణ రూపొందించుకొని, అధికారులకు దిశా నిర్దేశం చేశామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,అభిషేక్ అగస్త్య,జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డి.సి.పి. సందీప్ లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరము కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలపై ఆయా శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిచారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలలో మన ప్రగతి చాటేలా విధంగా ఘనంగా నిర్వహించాలనిఅన్నారు. ప్రధానంగా క్లస్టర్ పరిధిలో, గ్రామాలలో చేపట్టే పెద్ద కార్యక్రమాలైన రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించుటకు అధికారులు సమాయత్తం కావలి అన్నారు . నోడల్ అధికారులు తమ శాఖ ఇచ్చే ఆదేశాల తో పాటు కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం 2014 కు పూర్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పై నియోజక వర్గం వారీగా, గ్రామ, మండల వారీగా నాడు-నేడు పరిస్థితులపై అద్దంపట్టే విధంగా రూపొందించిన ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయుటకు ఆయా రోజులల్లో శాఖా కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కరపత్రాలు పంపిణి చేస్తారని, లబ్ధిదారుల విజయగాధలు, అభిప్రాయాలను నలుగురికి తెలిపేలా కార్యక్రమాలు రూపొందించాలి అని తెలిపినారు . చక్కటి ఫ్లవర్ డెకరేషన్ తో పాటు విద్యుత్ దీపాలతో. జిల్లాలోని కొన్ని ప్రధాన కార్యాలయాలతో పాటు దేవాలయాలు చర్చిలు ప్రార్ధన మందిరములు ప్రదేశాలను 21 రోజులపాటు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. అన్ని మునిసిపాలిటీలలో, జిల్లా ప్రవేశం, ముగింపు ప్రాంతాలలో, జంక్షన్ లలో ఆర్చీలు , ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయనున్నామన్నారు. అదేవిధంగా కార్యక్రమాల నిర్వహణపై డాక్యుమెంటేషన్ తో పాటు వీడియో చిత్రికరణ చేయాలని ఆదేసించినారు
రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవా లని సూచించారు..రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు
రైతు దినోత్సవం,ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు కావద్దని జిల్లా కలెక్టర్ అన్నారు. విద్యుత్ రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్, తెలంగాణ రన్ నిర్వహించాలని అన్నారు.
పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించాలని అన్నారు. బీసి కుల వృత్తుల ఆర్థిక సహాయంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని, దాని ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 9న ప్రారంభించాలని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేయాలని, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, క్రొత్త ఆసుపత్రుల ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను వివరించాలని, వైద్య, ఆరోగ్య శాఖ దినోత్సవం నాడు కేసిఆర్ న్యుట్రిషన్ కిట్ ప్రారంభించాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటాలని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్బంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని, సఫాయిన్న సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి త్రాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖలో సాధించిన ప్రగతి పక్కాగా తెలియజేయాలని, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి , అమరుల సంస్కరణ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని అన్నారు. జూన్ 2 నుండి 22వ తేదీ వరకు జరిగే దశాబ్ది ఉత్సవాలలో ప్రతి శాఖ కార్యక్రమాలు అందరి సహకారంతో విజయవంతం చేసే దిశగా కృషి చేయాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, సీపీవో మోహన్ రావు , ఆర్డీవోలు మల్లయ్య, రవి, డిఆర్డీవో పద్మజా రాణీ, జిల్లావైద్య అధికారి శ్రీనివాస్,జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి,వ్యవసాయ శాఖ అధికారి మేరీరేఖ, డిసివో శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, జిల్లా ఉద్యానవన శాఖ నీరజ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post