ప్రచురణార్ధం
ఆగష్టు 12 ఖమ్మం
వైరా నియోజకవర్గం వైరా రిజర్వాయర్ ట్యాంక్ బండ్ నిర్మాణము, పరిసర ప్రాంతం ఆనకట్టపై ఏర్పాటు చేసిన మొక్కలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గురువారం పరిశీలించారు. అనంతరం వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు ఆదేశాలు చేసారు. వైరా. మున్సిపాలిటీలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి పనుల పురోగతి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో వెజ్ నాన్-వెజ్ మార్కెట్లు ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని, డంపింగ్ యార్డుకు వెంటనే స్థలాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైరా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలున్నారు. పట్టణంలో ప్రకృతి వనాలు హరితహారం కార్యక్రమాలను నిరంతరం అధికారులు పర్యవేక్షించి వాటి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం తాటిపూడి రెబ్బవరం గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జైపాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా సంధన, మున్సిపల్ కమీషనర్ వెంకటస్వామి, తహసీల్దార్ రంగా, మండల అభివృద్ధి అధికారి ఎన్. వెంకటపతి రాజు, మండల స్పెషల్ అధికారి కె.సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది