వైల్డ్‌ లైఫ్ ఎవిడెన్స్ క‌లెక్ష‌న్ కిట్ ను ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

*వైల్డ్‌ లైఫ్ ఎవిడెన్స్  క‌లెక్ష‌న్ కిట్ ను ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌తో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అట‌వీ శాఖ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  అన్నారు.

 అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం సంద‌ర్భంగా వైల్డ్ లైఫ్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ ప్ర‌త్యేకంగా రూపొందించిన వైల్డ్‌ లైఫ్ ఎవిడెన్స్  క‌లెక్ష‌న్ కిట్ ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి…  అర‌ణ్య భ‌వన్ లో ఆవిష్క‌రించారు.

 

కిట్ ప‌ని తీరు, సాంపిల్స్ సేక‌ర‌ణ‌, వైల్డ్‌లైఫ్ DNA పరీక్షల‌ విశ్లేషణ, త‌దిత‌ర అంశాల‌ను వైల్డ్ లైఫ్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ (WCS) ప్రతినిదులు మంత్రికి వివ‌రించారు. వ‌న్య‌ప్రాణుల వ‌ధించిన‌ప్పుడు నేర ప‌రిశోధ‌నలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాల‌ను సేక‌రించ‌డం,  లేదా అవి స‌హ‌జ మ‌ర‌ణం పొందిన‌ప్పుడు కానీ  వాటి పాదముద్రలు, గోళ్లు,  వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాల సేక‌రించి వాటి డీఎన్ఏ  ప‌రీక్ష‌ల కోసం  Z.S.I., W..I.I., CCMB పంపుతామ‌ని తెలిపారు. విచార‌ణ స‌మ‌యంలో న్యాయ‌స్థానాల్లో ఈ ప‌రీక్ష‌ల రిపోర్టును  స‌మ‌ర్పించిన‌ప్పుడు… వాటి ఆధారంగా  వేట‌గాళ్ళ‌కు శిక్ష ప‌డే అవకాశం ఉంటుంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ…. నేర ప‌రిశోధ‌న‌లో ఆధారాల సేక‌ర‌ణ‌లో పోలీస్ లకు ఫోరెన్సిక్  విభాగం ఎంతో కీల‌క‌మైంద‌ని, అలాగే అంత‌రించిపోతున్న వ‌న్య‌ప్రాణుల రక్షణకు ఇలాంటి ఆధునిక శాస్త్రీయ ప‌ద్ధ‌తులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బ‌యోలాజిక‌ల్ ఎవిడెన్స్ ద్వారా వేట‌గాళ్ళ‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని, త‌ద్వారా వేట‌గాళ్ళు జంతువుల‌ను వ‌ధించే ఘ‌ట‌న‌లు త‌గ్గుముఖం పడ‌తాయ‌ని తెలిపారు. ఈ కిట్స్ ద్వారా సాంపిల్ సేక‌ర‌ణ‌, దాన్ని ఎలా ఉప‌యోగించాల‌నే దానిపై అట‌వీ శాఖ అధికారుల‌కు శిక్ష‌ణను ఇచ్చి ఈ కిట్ల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు.  అభ‌యార‌ణ్యాలు, వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రాలు,  అన్ని అట‌వీ డివిజ‌న్ల‌లో  ఈ కిట్స్ ను సాంపిల్ సేక‌ర‌ణ‌కు ఉప‌యోగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అట‌వీ అభివృద్ధి సంస్థ  చైర్మ‌న్ వంటేరు ప్ర‌తాప్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంక‌టర‌మ‌ణ  రెడ్డి,  అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, హైద‌రాబాద్ టైగ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ డైరెక్ట‌ర్  ఇమ్రాన్, WCS ఇండియా లీగ‌ల్  హెడ్ శ్యామ.కే., త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share This Post