వ్యక్తిగతంగా ఆరోగ్యంతో ఉంటూ సేవాభావంతో సమాజాభివృద్ధికి పాటుపడాలి …. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

వ్యక్తిగతంగా ఆరోగ్యంతో ఉంటూ సేవాభావంతో సమాజాభివృద్ధికి పాటుపడాలి …. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

ప్రచురణార్థం

వ్యక్తిగతంగా ఆరోగ్యంతో ఉంటూ సేవాభావంతో సమాజాభివృద్ధికి పాటుపడాలి …. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

పెద్దపల్లి, సెప్టెంబర్ -28:

వ్యక్తిగతంగా ఆరోగ్యంతో ఉంటూ సేవా భావంతో సమాజాభివృద్ధికి పాటుపడాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తెలిపారు

బుధవారం ఐ.టి. ఐ. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐ.టి.ఐ.ప్రాంగణ వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్నుకోబడిన అధ్యక్ష, కార్యదర్శి, సంఘ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని, వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని నిలబెడుతూనే సమాజ ఆరోగ్యాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు.

మనం మంచిగా బతకటానికి కలుషితం లేని వాతావరణం ఉంటే చాలు అనుకుంటాం కానీ మంచి వాతావరణంతో పాటు ఎటువంటి కల్మశాలు లేకుండా సమాజం ఉండాలని, స్నేహభావంతో ఉండే విధంగా నడక సాగిస్తూ, కలిసి కట్టుగా ఉంటూ మంచి ఆరోగ్యంతో మంచి సమాజంగా ఉండే సదుద్దేశ్యంతో వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి కృషి చేస్తున్నదని తెలిపారు.

నడక మనకు సంబంధించింది అయినను, మనకు మనంగా నడుస్తూ సమాజాన్ని మంచి మార్గంలో నడిచే విధంగా నిర్మించుకున్న వాకర్స్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మొదటగా నిలవాలని ఆశించారు.

స్థూల ఆర్థిక విధానం ప్రకారం మొత్తం వ్యవస్థ బాగు పడితే, దేశ సంపద పెరిగి, ఆ సంపాదన వ్యక్తిగతంగా వస్తె వ్యక్తులందరూ బాగుపడతారనీ, అలాగే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం ప్రకారం వ్యక్తి, వ్యక్తి ప్రతి వ్యక్తి బాగు పడితే, వీరందరూ కూడా ఆదాయాన్ని సృష్టించబడితే, వీరు ఆర్థికంగా అభివృద్ధి చేస్తే సమాజం మొత్తం అభివృద్ధి అవుతుందని, సూక్ష్మ ఆర్థిక శాస్త్రం ప్రకారం మనమందరం వ్యక్తిగతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజ ఆరోగ్యం కాపాడాలని తెలిపారు.

ఐ.టి. ఐ. వాకర్స్ అసోసియేషన్ మంచి పట్టుదలతో, ఐకమత్యంతో ఉండి సేవాభావంతో కార్యక్రమాలు చేపడుతున్నారు అని, ప్రభుత్వ పరంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ముందు వరుసలో ఉండి నడిపిస్తున్నారని, ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజ అభివృద్ధిలో మీ వంతు పాత్రను నిర్వహించాలని కోరారు.

వాకర్స్ అసోసియేషన్ కోరిక మేరకు ప్రభుత్వ పరంగా అన్ని నెరవేర్చామని, కొన్ని పనులు పూర్తి కాలేదని, వాకింగ్ ట్రాక్ కొరకు 10 లక్షలు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదని, వెంటనే పనులు మొదలు పెట్టే విధంగా, అలాగే ఐ.టి. ఐ కళాశాలకు భారం కాకుండా కళాశాల ప్రాంగణంలో విద్యుత్ పోల్స్ లను మునిసిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.వెంకట్ రెడ్డి, ప్రచార కార్యదర్శి వి. అశోక్ కుమార్ లు వాకార్స్ అసోసియేషన్ తరపున చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

వాకర్స్ అసోసియేషన్ తరపున అదనపు కలెక్టరు ను సన్మానించారు. అనంతరం సంఘ సభ్యులను అదనపు కలెక్టర్ శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ నరసింహా చారి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొమ్ము జగన్, ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటేశ్వర్ రావు, కోశాధికారి ఎస్. సంపత్ రెడ్డి, ప్రచార కార్యదర్శి వి. అశోక్ కుమార్, అసోసియేషన్ సలహాదారులు కొమ్ము సుధాకర్, చింతపండు కొమురయ్య, బి.జయపాల్ రెడ్డి, పేరాల రాజు, ఈ.సి. మెంబర్లు కొట్టే లక్ష్మయ్య, సి.హెచ్.స్వామి, ఏ.క్రిష్ణా రెడ్డి, ధరణి సతీష్, ఎలువాక రమేష్, కె. రాజి రెడ్డి, ఎం.మల్లేశం, వి.వి. రమణ, గుంటి కుమార్, ఆర్.ఎన్.స్వామి, దీటి సతీష్, వాకర్స్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post