వ్యక్తి గత నివాసప్లాట్ లో బిల్డింగ్ ప్లాన్ కోసం అన్ లైన్ లో దరకాస్తు చేసుకున్న వారి స్తల వివరాలను డాక్యుమెంటరి వెరిఫికేషన్ తప్పక చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష మున్సిపల్ కమీషనర్లకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 09-08-2021

వ్యక్తి గత నివాసప్లాట్ లో  బిల్డింగ్ ప్లాన్  కోసం అన్ లైన్ లో దరకాస్తు చేసుకున్న వారి స్తల వివరాలను డాక్యుమెంటరి వెరిఫికేషన్ తప్పక చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష  మున్సిపల్ కమీషనర్లకు ఆదేశించారు.

        సోమవారం సమావేశం హాలు నందు మున్సిపల్ కమీషనర్ల తో  ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ అప్రూవల్ కోసం  టి ఎస్ – బి పాస్  చట్టాన్ని ప్రవేశ పెట్టిందని, జిల్లా స్తాయి లో టి ఎస్ – బి పాస్ కమిటి ఉంటుందని ,  75 గజాల నుండి 600 గజాలు , 10 మీటర్ల ఎత్తు ఉన్న వ్యక్తి గత నివాస ప్లాట్ లో   భవన నిర్మాణం కోసం  వచ్చిన దరకాస్తులను టైటిల్ వెరిఫికేషన్  మరియు ఫిసికల్ వెరిఫికేషన్ చేసి మున్సిపల్ కమీషనర్లకు రిపోర్ట్  పంపాలని టౌన్ ప్లానింగ్ సిబ్బంది , డిప్యూటీ తహసిల్దర్లకు ఆదేశించారు.  భవన నిర్మాణానికి దరకాస్తు సమర్పించిన తేది నుండి  21 రోజులలో బిల్డింగ్ నిర్మాణానికి  అనుమతి  ఇవ్వాలని అన్నారు. అనుమతి పొందిన 15 రోజుల తర్వాత ఇంటి నిర్మాణం ప్రారంభించవచ్చని తెలిపారు.  వచ్చిన ధరఖాస్తులలో లోటుపాట్లు ఉంటే 10 రోజులలో వాటిని సరి చేయాలనీ అన్నారు. రెసిడెన్షియల్ మరియు నాన్ రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి అనుమతి పొందదానికి అవసరమైన అన్ని రకాల నో అబ్జేక్సన్  సర్టిఫికేట్ల కోసం   (NOC) సింగల్ విండో సిస్టం ప్లాట్ ఫార్మ్ ద్వారా దరకాస్తు చేసుకోవచ్చని  తెలిపారు. దరకాస్తు ను 21 రోజులలో ప్రాసెస్ చేయకపోతే ఆమోదించినట్లు పరిగనించబడుతుందని తెలిపారు. వెరిఫై చేసిన తర్వాత జరగాల్సిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను పోస్ట్ వెరిఫికేషన్ టీం చూడాలని అన్నారు.

 అనుమతి లేని నిర్మాణాలు, లేఔట్లను  గుర్తించి వాటి  పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కమిటి ఏర్పాటు చేసిందని,  అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయాలని  అన్నారు. లాగిన్ లో ఉన్న పెండింగ్ ధరకాస్తులను క్లియర్ చేయాలనీ అన్నారు.. మున్సిపాలిటీ పరిధి లో అనుమతి లేని నిర్మాణాలు  జరుగ కుండ చూడాలని  అధికారులకు ఆదేశించారు.

ఈ సమావేశం లో మున్సిపల్ కమీషనర్లు శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, నిత్యానంద్, ఫల్లా రావు, టౌన్ ప్లాన్నింగ్ అధికారులు, డిప్యూటీ తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————————  

  జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post