వ్యవసాయ,అనుబంధ రంగాలకు బ్యాంకర్ లు విరివిగా రుణాలు ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వ్యవసాయ,అనుబంధ రంగాలకు బ్యాంకర్ లు విరివిగా రుణాలు ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-

జలవనరుల లభ్యత అధికంగా ఉండడం, వ్యవసాయ , అనుబంధ రంగాల అభివృద్ధికి రాజన్న సిరిసిల్ల జిల్లా లో అధిక అవకాశం ఉన్న దృష్ట్యా వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ నందు జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం జరిగింది. కమిటీ ఛైర్మన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2022-23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటి వరకూ సాధించిన ప్రగతి పై జిల్లా కలెక్టర్ బ్యాంకర్ లతో సమీక్షించారు.

వార్షిక రుణ ప్రణాళిక క్రింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2692 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు వివిధ కేటగిరీల కింద రూ.486 కోట్ల రుణాలు ( 18 శాతం) మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

షార్ట్ టర్మ్ పంట రుణాల లక్ష్యం మొత్తం 778 కోట్లకు గానూ కేవలం 104 కోట్లు మాత్రమే , వ్యవసాయ టర్మ్ లోన్ లక్ష్యం 647 కోట్లు ఉండగా 83 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్న రుణ మంజూరు లక్ష సాధన ఆశించిన మేర లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

వ్యవసాయంపై ఆధారపడిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు అధికంగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాలో అమలు చేయాలన్నారు.

MSME రుణాల మంజూరు లోనూ కేవలం 11 శాతం మాత్రమే పురోగతి ఉందన్నారు. ఈ రంగంలో మరింత పురోగతి సాధ్యమైనంత త్వరగా సాధించాలన్నారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరులో 43.6 శాతం లక్ష్య సాధన, పట్టణాలలో స్వయం సహాయక సంఘాల రుణ మంజూరులో 44 శాతం లక్ష్యసాధన పట్ల పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వానిధి లక్ష్య సాధనలో బ్యాంకర్లు మంచి పనితీరు కనబరచడం పట్ల జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను అభినందించారు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం ( PMFME స్కీం) లో అమలుపై బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులు,యువతకు రుణ మంజూరు కన్సెంట్లను ఇవ్వాలన్నారు. పాడి గేదెల యూనిట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న రైతులకు రుణాలను మంజూరు చేయాలన్నారు.

మద్య మానేరు జలాశయం ముంపు గ్రామాల ప్రజలకు వివిధ కేటగిరీల లో యూనిట్ ల స్థాపన కు ముందుకు వస్తే రుణ మంజూరులో బ్యాంకర్లు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

వార్షిక రుణ ప్రణాళిక లక్ష్య సాధనకు సంక్షేమ అధికారులు, ఒక్కో బ్యాంకు నుంచి ఒక్కో బాధ్యుడిని చేర్చి వాట్సప్ గ్రూప్ పెట్టుకొని లక్ష్యాల పురోగతి పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కు సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న జిల్లా , అభివృద్ధికి అన్ని విధాలుగా వనరులు ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధి కారులతో పాటు బ్యాంకర్లు పాటుపడాలన్నారు.

రుణాల మంజూరు తో పాటు రుణ రికవరీ లపై కూడా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు రిసోర్సు పర్సనల్ సహాయంతో రుణగ్రహితలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రుణ చెల్లింపుల ప్రాధాన్యతను వివరించి రికవరీల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు.

సమావేశం ప్రారంభం కు ముందు Ldm TN మల్లికార్జున్ రావు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో వార్షిక రుణప్రణాళిక లక్ష్యాలు సాధింపులు ప్రగతిని వివరించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, DRDO గౌతమ్ రెడ్డి, UBI బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ టీ వంశీకృష్ణ, ఆర్బిఐ LDO ఎంఎస్ సాయి చరణ్, నాబార్డ్ డీడీఎం పి మనోహర రెడ్డి, బ్యాంకర్ లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————–

 

Share This Post