వ్యవసాయాధారిత భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 11,ఖమ్మం:

వ్యవసాయాధారిత భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ అన్నారు. నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు అవేర్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ వీడ్కోలు సమావేశం నగరంలోని టి.టి.డి.సి సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న 32 మందికి ధృవీకరణ పత్రాలతో పాటు బ్యాంకు ఋణాల మంజూరు లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయకుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించి రైతులకు మరింత చేరువ చేసేందుకు అగ్రీ రైతు సేవాకేంద్రాలను విస్తరింపచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, కోటి 30 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి ఎఫ్.సి.ఐకు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వ్యవసాయానుబంధ రంగాలలో రైతులకు మరింత అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 8 వందలకు పైగా వ్యవసాయ విస్తరణాధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసిందని, తద్వారా ఇప్పటికే వ్యవసాయానుబంధ రంగాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం రైతులకు నేరుగా చేర్చేవిధంగా వ్యవసాయ విస్తరణాధికారులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. రాబోయో రోజుల్లో పంటల సాగు విధానంలో మార్పులు అవసరమని తదనుగుణంగా అగ్రిపెన్యూర్స్ ఆగ్రో రైతుసేవాకేంద్రాల ద్వారా రైతుల అవసరాల కనుగుణంగా ఇన్ ఫుట్లను అందించాలని మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు వ్యవసాయానుబంధ రంగాలకు సంబంధించిన యూనిట్ల స్థాపన, అభివృద్ధిపై 45 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల ద్వారా అగ్రిప్రెన్యూర్స్ నూతన పంటల విధానాలను రైతులకు లభదాయకంగా ఉండే పంటలసాగును ఆయా ప్రాంతాల రైతుల అవసరాలకనుగుణంగా ఆగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా మరింత విస్తరిపంచేయాలన్నారు. ఖమ్మం జిల్లా వ్యవసాయానికి అనుకూలమైన జిల్లా అని, జిల్లాలో నీటిపారుదల సౌకర్యం సమృద్ధిగా ఉందని, దీనితోపాటు ఆయిల్ పామ్ సాగు పరిధి కూడా విస్తరిస్తున్నదని, తదనుగుణంగా నూతన పంటల విధానం ప్రభావం రైతాంగంపై స్పష్టంగా కనిపించేలా ఉండాలని కలెక్టర్ అన్నారు.

మేనేజ్ డైరెక్టర్ జనరల్ పి.చంద్రశేఖర్, టి.ఎస్ ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాములు మాట్లాడుతూ. నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారికి ప్రత్యేక శిక్షణ నివ్వడం ద్వారా రైతుముంగిటకు తీసుకెళ్ళేందుకు రైతు అగ్రీ సేవాకేంద్రాల ద్వారా రైతులకు మరింత చేరువ చేస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన ఇన్ ఫుట్ట్స్ తో పాటు సేంద్రియ వ్యవసాయంపై రైతులను మళ్ళించే ||దిశగా అగ్రి ప్రెన్యూర్స్ దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని వారు తెలిపారు. దేశంలోని 74 వ్యవసాయ విద్యాలయాల నుండి ప్రతి ఏటా దాదాపు 80 వేల మంది పట్టభద్రులవుతున్నారని వీరిద్వారా దేశంలోని రైతాంగానికి లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక శిక్షణతో పాటు బ్యాంక్ ఋణాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు వారు తెలిపారు.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, అవేర్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ.జి.ఎం వి.వి.నారాయణ, మేనేజర్ శివకుమార్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, అవేర్ నోడల్ అధికారి కె.మీరా ప్రసాద్, నాబార్డ్ డి.డి.ఎమ్ సుజిత్, హైద్రాబాద్ ఎస్.బి.ఐ ఏ.జి.ఎం కె.వి.ఎల్.ఎన్ మూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Share This Post