వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే రైతన్నకు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే రైతన్నకు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెట్ యార్డ్, పౌరసరఫరాల శాఖ , మార్క్ ఫెడ్,జిల్లా కోపరేటివ్  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రైతు వేదికలు పూర్తయ్యాయా ? వాటిలో ఫర్నిచర్ ఉందా, రైతు వేదికలలో ఏ సమావేశాలు ఏర్పాటు చేస్తారు, తదితర అంశాలను వ్యవసాయాధికారిని ప్రశ్నించారు. ఇందుకు జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్ మాట్లాడుతూ జిల్లాలో రైతు వేదికలు 99 గాను 97 పూర్తి అయ్యాయని తెలిపారు. వాటిలో  రైతులకు పంటలపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని కలెక్టర్ గారికి  వివరించారు. 1 02 మంది  ఏ ఈ ఓ లు పని చేస్తారని తెలిపారు. 10 వేల ఎకరాలకు  ఇద్దరు  ఏ ఐ ఓ లు ఉండి పంటల సర్వే జరుగుతున్నదని, రైతులు  యాసంగి, ఖరీఫ్ లలో ఏ ఏ పంటలు సాగుచేశారో నివేదిక అందజేస్తామని తెలిపారు. జిల్లాలో 95,809 మంది రైతులు రైతు బీమా చేయించుకున్నారని 4,710 నాలుగు మంది రైతులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50,000 రుణమాఫీ వచ్చిందని అన్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప మాట్లాడుతూ జిల్లాలో అలంపూర్, గద్వాల మార్కెట్ యార్థులు,అయిజ సబ్ మార్కెట్ యార్డ్ ఉన్నాయని తెలిపారు. మార్కెట్ యార్డులకు వేరుశనగ వరి ధాన్యం తెచ్చే రైతులకు 70 మంది కొనుగోలుదారులు ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహించి ఖరీదు చేస్తారని అన్నారు. ఖరీదు చేసిన పంట ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.  జిల్లా లో 19 కమిటీలు ఉన్నాయని,ఏ ఎం సి ఎస్ ఆలంపూర్, గద్వాల్ సబ్ సెంటర్ ఐజాలో ఉందని , ప్రతి రోజు మార్కెట్ కు వచ్చే సరుకుని కొని ఆన్లైన్ ద్వారా పే మెంట్స్ చేస్తామని ,మార్కెట్ యార్డ్ లో పనిచేసే హమాలి, దళవాయి, చాట కూలీలకు రైతు బీమా వర్తింపజేస్తుందని మార్కెటింగ్ అధికారి  కలెక్టర్ గారికి వివరించారు. జిల్లాలో అలంపూర్ అయిజ గద్వాల లో స్టాక్ పాయింట్ లో ఉన్నాయని, వాటి ద్వారా నిత్యావసర సరుకులు డిలర్లకు పంపిణీ చేస్తామని , ఇప్పటి వరకు  70 కేసులు బుక్ చేసామని సివిల్ సప్లయ్ అధికారి తెలిపారు. జిల్లాలో 500 మంది ఫెర్టిలైజర్స్స్ డీలర్లు ఉనారని, జిల్లా కోపరేటివ్ అధికారి  తెలిపారు.

సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, సక్రినయాక్,మార్క్ ఫెడ్ హనుమంతు, డి ఎస్ ఓ రేవతి, డి యం ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది.

 

 

 

Share This Post