వ్యవసాయ అధికారులకు శిక్షణ

పత్రిక ప్రకటన,
తేది :- 07.08.2021.
వికారాబాద్ జిల్లా :- వికారాబాద్, పరిగి డివిజన్లకు చెందిన వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అధ్యక్షతన రైతు వారిగా పంట నమోదు, రైతు భీమా, ఋణ మాఫీ, పియం కిసాన్ యోజన తదితర పథకాల అమలు తీరుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, AEO లు గ్రామాలలో కచ్చితంగా రైతు వేదికలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పంట దిగుబడి పెంపొందించేందుకు వినియోగించే అదునాతన వ్యవసాయ పద్ధతులను వారికి రైతు వేదికల ద్వారా వివరించాలన్నారు. రైతు పండించే పంట నమోదులో భాగంగా అధికారులు వారి పొలాలను సందర్శించిన పిదప పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. ఆగష్టు,3 వరకు పట్టా పాసు పుస్తకాలు జారీ అయిన రైతులకు సంబంధించి రైతు భీమా దరఖాస్తు చేసుకునేటట్లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపు ఉన్నవారే అర్హులని తెలియజేసినారు. రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్, 2014 నుండి డిసెంబర్, 2018 మధ్యా కాలంలో రూ. 50 వేల పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు సేకరించి ఈ నెల 16 నుండి నమోదు కార్యక్రమం చేపట్టనున్నందున, రైతు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు.
అనంతరం పంట నమోదు, రైతు భీమా, పంట రుణమాఫీ, PM కిసాన్ యోజన తదితర అంశాలపై AEO లకు నిష్ణాతులైన వ్యవసాయ అధికారులతో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, వ్యవసాయ అధికారులు లావణ్య, జాన్సీ లక్ష్మి బాయి, కృష్ణకాంత్, రమాదేవి, విజయభారతి లతో పాటు వికారాబాద్, పరిగి డివిజన్ ల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
≠======================
DPRO/VKB.

Share This Post