వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ పై రైతులు దృష్టి సారించాలి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి వ్యవసాయ రంగం తో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ పై రైతులు దృష్టి సారించి ఆదాయాభివృద్ది సాదించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగ దీశ్ రెడ్డి అన్నారు.

పత్రికా ప్రకటన
నల్గొండ,ఆగస్ట్ 3.
వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ పై రైతులు దృష్టి సారించాలి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
వ్యవసాయ రంగం తో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ పై రైతులు దృష్టి సారించి ఆదాయాభివృద్ది సాదించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగ దీశ్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా గోపాల మిత్రుల పునశ్చరణ తరగతుల సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి అమ్మ పాల తర్వాత ఆహారం తో పాటు ఆవు,గేదె పాలు మనిషికి ఎంతో ఉపయోగం అని అన్నారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం తో పాటు పశు సంపద వృద్ధి చెందలేదని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం,పాడి, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు.మనిషి ఆరోగ్యం గా ఉండటానికి తీసుకునే పాలు కల్తీ కి గురవుతున్నట్లు తెలిపారు.ఉత్పత్తి తక్కువ,వాడకం ఎక్కువ గా ఉన్నందున డిమాండ్ కు అనుగుణంగా జనాభా కు సరిపడా సరఫరా లేదని అన్నారు.దీంతో కొందరు ఆహార ,పాల ఉత్పత్తులు కల్తీ పాల్పడుతున్నారని,ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని అన్నారు.వ్యవసాయం లో తెలంగాణ దేశం లో అగ్రగామిగా ఉందని,కూరగాయలు, మాంసం ఉత్పత్తులు పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.పాల,మాంసం ఉత్పత్తులు, కూరగాయలు సాగు పై మన అవసరాల కనుగుణంగా దృష్టి సారించాలని అన్నారు.పశువులు లేకుంటే వ్యవసాయం లేదని,పాడి పశువులు ఉంటేనే భూమి ఉందని అన్నారు.హరిత విప్లవం తో ఎరువుల వాడకం తో భూసారం దెబ్బతిందని అన్నారు.సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా దిగుబడి అధికంగా సాధించ వచ్చని అన్నారు.ఆవు పాల తో ఆహార పోషక ఉత్పత్తులు, ఆవు పేడ మూత్రం తో ఎరువు తయారు చేయవచ్ఛని, బహుళ ప్రయోజనం గా పాడి సంపద రైతు కు లాభం చేకూర్చుతుందని అన్నారు.పశు ఆహారం గడ్డి విత్తనాలు కూడా మేలు జాతి రకాలు ఉపయోగించాలని అన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పునరుత్పత్తి యోగ్యమైన పాడి పశువుల సంఖ్య 5,39,406 ఉండగా కృత్రిమ గర్భ ధారణ 3,54,127 నిర్వహించినట్లు తెలిపారు.పాడి,పశు సంపద పెంపొందించాలని,గోపాల మిత్రలు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించటం లో ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్మ ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లకు 8500 కనీస వేతనం ఉండేలా నిర్ణయించారని అన్నారు.పశు గణాభి వృద్ధి సంస్థ చైర్మన్ కోరిన విధంగా గోపాల మిత్రలకు పి.ఆర్.సి వర్తింపు అంశం పై పరిశీలిస్తానని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా కృత్రిమ గర్భ ధారణ పద్ధతి లో పశు సంపద వృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. సన్నకారు,చిన్మ కారు రైతులు వ్యవసాయ పంటలతో పాటు పాడి రంగం ప్రోత్సాహం ఇస్తే రైతుల ఆదాయం తో పాటు పాల ఉత్పత్తులు పెరుగుతాయని అన్నారు. మన వాతావరణ పరిస్థితులు తట్టుకునే మేలు రకమైన దేశీయ జాతుల పశుసంపద ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
డి.సి.సి.బి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గోపాల మిత్రలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించ టానికి పశు గణాభి వృద్ధి సంస్థ ఆలోచించాలని అన్నారు.
శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అందుబాటులో వనరుల ద్వారా పశు సంపద పెంపుకు రైతులకు అవగాహన కలిగించాలని,ఆడ దూడల ఉత్పత్తి పెంచాలని అన్నారు.
ఈ సామవేశం లో పశుగణాభి వృద్ధి సంస్థ రాక్హ్త్ర5 ఛైర్మన్ రాజేశ్వర్ రెడ్డి,జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్జి రెడ్డి,సి.ఈ. ఓ.మంజు వాణి, పశు సంవర్థక శాఖ జె.డి.సుబ్బారావు,ఓవిధ జిల్ల్లాల చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post