వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 28:

వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇట్టి నిధిని పంట తర్వాత నష్టాలు తగ్గించడానికి ఉద్దేశించబడిందన్నారు. ఆధునిక ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇట్టి పథకం 2020-21 సంవత్సరం నుండి 2032-33 సంవత్సరం వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ పథకంలో ఆర్థిక సౌకర్యానికి తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 7 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందన్నారు. ఈ పథకం లో ఇ-మార్కెటింగ్ ప్లాట్ ఫామ్స్, వేర్ హౌజ్, సిలోస్, ప్యాక్ హౌజ్, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్ సౌకర్యాలు, ప్రైమరీ ప్రాసెస్సింగ్ యూనిట్లు తదితర యూనిట్ల స్థాపన చేయొచ్చన్నారు. అన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఆర్థిక సేవలు అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తదితరాలు ఈ పధకంలో భాగస్వామ్యం అవుతాయన్నారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, జెడ్పి సిఇఓ అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, ఎల్డిఎం శ్రీనివాస్ రెడ్డి, డిఏవో విజయ నిర్మల, డిసిఓ విజయ కుమారి, డిఎంవో నాగరాజు, డీడీఎం సుజిత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post