వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాని దేశానికి ఆదర్శంగా తీర్చిద్దిదేలా ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాని దేశానికి ఆదర్శంగా తీర్చిద్దిదేలా ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

సోమవారం రాజేందర్ నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో వానాకాలం 2022 సంసిద్ధత పై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు, రైతు బంధు సమితి కోఆర్డినెటర్లకు అవగాహన కై ఒక్కరోజు వర్క్ షాప్ ను జిల్లా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ వర్క్ షాప్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి కె.సి.ఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అధికార్లు కార్యచరణ ప్రణాళికను రూపొందించి క్షేత్ర స్థాయిలో అమలు అయ్యే విధంగా పని చేయాలని సూచించారు. అత్యధిక జనాభాకు వ్యవసాయ రంగం ఉపాధి కలిపిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని తెలిపారు . రాష్ట్ర స్థూల ఉత్పత్తి 21 శాతంతో తెలంగాణ రాష్ట్రo దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన రైతుబంధు రైతుభీమ పథకాలకు ఐక్య రాజ్యసమితి ప్రశంస లభించిందన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా కార్యచరణ రూపొంధించుకొని పని చేయాల్సినవసరం ఎంతైన ఉందని అన్నారు. ఒకే పంటని వేయడం వలన భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని అన్నారు. పంట మార్పిడి చేపట్టి లాభదాయక సాగుకు ప్రాధాన్యత ఇస్తూ దిగుబడి పెంచే దిశగా కృషి చేయాలన్నారు. సంవత్సరానికి రెండు సార్లు భూసార పరీక్షలు నిర్వహించి రైతులు లాభం పొందే విధంగా పంటలు వేసెల అవగాహన కలిపించాన్నారు. పత్తి,కంది సాగు విస్తీర్ణం పెంచే దిశగా కృషి చేయాలని అన్నారు. ఒకసారి కాపుకి వచ్చే పత్తి రకానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, పువ్వులు సాగు పై దృష్టి సారిధ్ధమని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి పై విజయ గాధలను అందించాలని అన్నారు .
రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రంగారెడ్డి జిల్లా సమీపాన ఉన్నందున రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కు సాగు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో గణనియంగా అభివృద్ధి చెందిందని అనడం లో ఎలాంటి సందేహం లేదని తెలిపారు విత్తనాలు మొదలుకొని ధాన్యం కొనుగోలు కొరకు బాధ్యతలను ప్రభుత్వమే తీసుకున్నదని అన్నారు కార్యచరణ ప్రణాళికా ప్రకారం వ్యవసాయ రంగంను మరింత మెరుగు పరిచి అభివృద్ధి సాదించే దిశగా కృషిచేయాలని మంత్రి అన్నారు.
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ప్రాంత రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రంగారెడ్డి జిల్లా సమీపాన ఉన్నందున జిల్లా లో అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కు ఉన్న పంటల సాగు చేపట్టాలని తెలిపారు.
రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్ ఎమ్.ఎల్.సి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను, అభివృద్ధిని వివరించారు. ఆధునికత విషయాలపై రైతులకు సరైన దిశగా అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునంధన్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నీళ్లు,నిధులు నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా శాస్త్రీయంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు మరింత లక్ష్య శుద్ధి తో పని చేస్తేనే ముఖ్య మంత్రి గారు ఆశించిన ప్రగతిని సాదించగలమని తెలిపారు. వ్యవసాయానికి సంబందిచిన అనేక అంశాలలో మరింత మెరుగైన మార్పును సాధించగలమని అన్నారు. క్రాఫ్ బుకింగ్ సర్వే నెంబర్ వారిగా చేపట్టాలని రైతు వేదికలలోనే అన్నీ సమావేశాలను నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయ ఉద్యానవాన అధికార్లు సమన్వయం తో పని చేయాలని సూచించారు. వరి నేరుగా విత్తడం, పత్తి, కంది విస్తీర్ణం పెంచడం అధిక సాంద్రత పద్ధతి లో పత్తి సాగు వంటి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నందున రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నారు.
ఈ వర్క్ షాప్ లో రంగారెడ్డి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునిత మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ మన్ శరత్ చంద్రా రెడ్డి,ఎం.ఎల్.సి లు సురభి వాణి దేవి, దయానంద, శాసన సభ్యులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య,భేతి సుభాష్ రెడ్డి,మెతుకు ఆనంద్,ఎం.పి.పి.లు,జడ్పీ.టి.సి.లు,జిల్లా,మండల రైతుబంధు సమితి కొఆర్డినటర్లు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత్, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవాన శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post