వ్యవసాయ రంగంలో రైతులు ప్రత్యామ్నాయ, లాభసాటి వ్యవసాయం నూతన ఒరవడిని అనుసరించాలి – రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రచురణార్థం-
తోర్రుర్/మహబూబాబాద్-2021 నవంబర్-08 :
వ్యవసాయ రంగంలో రైతులు ప్రత్యామ్నాయ, లాభసాటి వ్యవసాయం నూతన ఒరవడిని అనుసరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

సోమవారం ఉదయం తొర్రూర్ మండలం అమ్మా పురం గ్రామం లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మంత్రి అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ,లాభసాటి పంటలను రైతులు వేసుకోవాలని, వడ్లు కొనే పరిస్థితి రాష్ట్రంలో లేదని ,వరి ధాన్యం వేసుకొని రైతులు నష్టపోవద్దని, పామాయిల్ పంటలు వేసుకోవాలని ఈ ప్రాంతంలో తేమశాతం పెరిగిందని, 150 ఎకరాల్లో ప్యాక్టరీ నిర్మిస్తున్నట్లు,1 ఏకరానికి బి సి లకు 80%, sc &st లకు 90% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలను కల్పించాలని, కొనుగోలు కేంద్రం కు వచ్చిన ధాన్యాన్ని వెంటనే వేయాలని, నాణ్యమైన విత్తనాలను రైతులు వేసేట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అమ్మపురం పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత వానాకాలం లో 2870 మంది రైతుల నుండి 3 లక్ష ల 33 వేల 378 బ్యాగులు కొనుగోలు చేయగా సుమారు 24 కోట్ల 80 లక్షల రూపాయల ను రైతుల ఖాతా ల్లో జమ చేయబడిందని, యాసంగి లో 4463 మంది రైతుల నుండి, 6లక్షల72వేల బ్యాగులు కొనుగోలు చేసి 5కోట్ల రూపాయలు రైతులకు బ్యాంకు ఖాతాలల్లో వారికి నేరుగా చెల్లించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డి ఆర్ డి ఓ పిడి సన్యాసయ్య, డి పి ఓ సాయి బాబా, డి ఎస్ ఓ నర్సింగరావు, డి ఎం మహేందర్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ,డి సి ఓ సయ్యద్ ఖుర్షీద్, ఆర్డిఓ రమేష్ బాబు, ఎంపీపీ అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, ఏవో కుమార్ యాదవ్, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి , సర్పంచి యాకయ్య, ఎమ్ పి టి సి డి లు ఉప్పలయ్య విక్రమ్ రెడ్డి పిఎసిఎస్ , రైతు సమన్వయ సమితి వీరభద్ర రావు, డైరెక్టర్లు స్టాప్, ప్రజాప్రతినిధులు, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది

Share This Post