వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ కృషి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, రైతుల ఆర్థికాభివృద్ధి, అభ్యున్నతి, సంక్షేమం దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్దితో కలిసి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి వ్యవసాయ విస్తరణాధికారులు కృషి చేయాలని, జిల్లాలోని “70 క్షస్టర్లలో నిర్వహిస్తున్న విధులపై ప్రతి రోజు పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులకు రైతువేదికలే కార్యాలయాలని, ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, గ్రామాలలో రైతులకు వ్యవసాయ సాగు, సంబంధిత అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చిరుధాన్యాల సాగుపై ప్రతి రైతు ప్రత్యేక దృష్టి సారించేలా మెళకువలు నేర్పించాలని, జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో 10 ఎకరాలలో చిరుధాన్యాల సాగు చేయాలని తెలిపారు.
రబీలో లక్ష ఎకరాల సాగు కోసం ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని, 500 [గ్రామాలలో త్రీ ఫేజ్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వేసవికాలం పంటలకు ఉచిత విద్యుత్‌ అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిషేధిత గడ్డి వాడితే రైతు బంధు, రైతు భీమా తదితర పథకాలను నిలిపివేయడం జరుగుతుందనే విషయాన్ని రైతులందరికీ తెలియజేయాలని, జిల్లాలో 1 లక్షా 17 వేల మందికి రైతు బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. 2 వేల 500 ఎకరాలలో జొన్న సాగు చేయడం జరుగుతుందని, సాగు విస్తీర్ణం పెంచవలసిన అవసరం ఉందని, నిర్ధిశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించిన 5 గురు వ్యవసాయ విస్తరణాధికారులను జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అవార్డులు ప్రధానం చేయడం జరుగుతుందని, పోటీతత్వంతో విధులు నిర్వహించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవికృష్ణ సహాయ అధికారి రామకృష్ణ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, ఉద్యానవన అధికారులు, ఏ.డి.ఏ.లు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

 

Share This Post