వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడి అర్హత గల ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు లేకుండా 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో శాన్నిటైజింగ్‌ చేసిన తర్వాతనే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని, గ్రామాల్లోని ప్రజలందరూ వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనాను కట్టడి చేయడం సాధ్యపడుతుందని, గ్రామస్తులకు అందుబాటులో వారి నివాసాలకు సమీపంలోనే వ్యాక్సిన్‌ అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొని కరోనా నియంత్రణకు సహకరించాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాలలో విద్యార్థుల హాజరు రికార్డును పరిశీలించి, పాఠశాల ఆవరణ, పరిసరాల పరిశుభతపై ఉపాధ్యాయులు, సిబ్బంది తగు సలహాలు, సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో తహశిల్దార్‌ పుష్పలత, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి అరుణారాణి, మండల పంచాయతీ అధికారి రమేష్‌, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి మండలం కేంద్రంలో…

అనంతరం దండేపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్‌ పై ఎలాంటి అపోహలు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని, కొవిడ్‌-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరిస్తూ, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుండి వైరస్‌ నియంత్రించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామస్తులకు అందుబాటులో వారి నివాసాల సమీపంలోనే వ్యాక్సిన్‌ అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, వైద్యాధికారి సునీల్‌, సర్పంచ్‌ చంద్రకళ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post