వ్యాక్సినేషన్‌ ద్వారా కరోనా నియంత్రణ : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

వ్యాక్సినేషన్‌ ద్వారా కరోనాను నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. బుధవారం జైనూర్‌, సిర్బూర్‌(యు) మండలాలలో జైనూర్‌, మహాగాం, మార్లవాయి గ్రామాలలో రాయి సెంటర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్‌ అవగాహన సదస్సులలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీతో కలిసి హాజరయ్యారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదని, వ్యాక్సినేషన్‌ ద్వారా కరోనా వైరన్‌ నియంత్రణ సాధ్యపడుతుందని, ఇందుకు ప్రజలందరు సహకరించి వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 1 లక్షా 50 వేల వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, 18 నం॥లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకొని 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్వా పండుగలు జరుపుకోకపోవడంతో పాటు ఎవరికి ఎవరు కలవలేని విధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ పరిస్థితిని అధిగమించి కలిసి ఉండేందుకు వ్యాక్సినేషన్‌ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జైనూర్‌లో మైనార్టీ నాయకులతో మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో రాయి సెంటర్‌ల ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు గిరిగూడాలలో గిరిజనులను వ్యాక్సినేషన్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిన్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీనుకునే విధంగా ప్రోత్సహించాలని, గ్రామాల పరిధిలో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు తమ సమీపంలోని శిబిరానికి వెళ్ళి వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. వ్యాక్సినేషన్‌పై జిల్లాలో ప్రత్యేక డైవ్‌ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మత పెద్దలు, సoబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post