వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా చేపట్టాలి…

ప్రచురణార్థం

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు సంయుక్తంగా చేపట్టాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 15.

వ్యాక్సినేషన్ కార్యక్రమం నూరు శాతం విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సంయుక్తంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై హనుమకొండ జిల్లా నుండి మంత్రి పాల్గొనగా మంత్రితోపాటు గా హైదరాబాదు నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో పాల్గొని జిల్లా పరిషత్ చైర్మన్లు జిల్లా కలెక్టర్లు తో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకరరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు. రెండు కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని ప్రశంసించారు.
ఇకముందు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ఉద్యమస్ఫూర్తితో చేపట్టి నూరు శాతం విజయవంతం చేయాలన్నారు గ్రామ పంచాయతీ స్థాయిలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలును పటిష్టంగా చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ముందుగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తద్వారా విజయవంతంగా ముందుకు వెళ్లాలన్నారు. గ్రామాల పరిధిలో సబ్ సెంటర్ల నిర్మాణం చేపట్టామని వాటిని తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు అదేవిధంగా గ్రామ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వెసలుబాటు గా ఉన్న పాఠశాల గ్రామ పంచాయతీ భవనం కమ్యూనిటీ భవనాలు ప్రభుత్వ భవనాలు తో పాటు రైతు వేదికలను కూడా వినియోగించుకోవచ్చు నన్నారు ఇది ఒక ప్రజా ఉద్యమమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ భుజస్కంధాలపై వేసు కున్నందున ఈ మహాయజ్ఞంలో మనమందరం బాసటగా నిలవాలని అన్నారు గ్రామస్థాయిలో వార్డు సభ్యులు సర్పంచుల సహకారం తీసుకోవాలన్నారు మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు తో అధికారులు సంయుక్తంగా చేపట్టాలన్నారు సూక్ష్మస్థాయిలో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని 18 సంవత్సరములు పూర్తయిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేరవలసిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ మాట్లాడుతూ అధికారులు నిరంతరం సమీక్షించాలని రోజువారి కార్యక్రమంలో పది నిమిషాల సమయం వెచ్చించి వ్యాక్సినేషన్ పనితీరును సమీక్షించుకోవాలి అన్నారు కంట్రోల్ రూమ్ నిర్వహణ నిరంతరం కొనసాగుతూనే ఉండాలని అని సమాచారాన్ని సేకరించి పత్రికలకు అందజేయాలన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గా స్టిక్కర్లు వేయాలన్నారు గ్రామ పంచాయతీలలో వేయించాలని ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలన్నారు ఒక క్రమపద్ధతిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టి మరింత ముందుకు తీసుకు వెళ్లాలన్నారు

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ చైర్మన్ కుమారి బిందు జిల్లా కలెక్టర్ శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ఉప వైద్యాధికారి అంబరీష తదితరులు పాల్గొన్నారు
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post