వ్యాక్సినేషన్ కు విస్తృత ప్రచారం నిర్వహించండి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 21, 2021ఆదిలాబాదు:-

వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా ప్రజలకు అవగహన కల్పిస్తూ, లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున జైనథ్ మండలంలోని జైనథ్, కాప్రి గ్రామాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు అర్ధమయ్యే విధంగా వ్యాక్సినేషన్ పై అవగహన కల్పిస్తూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకునే విధంగా విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. టీకా మందు వేసుకునేందుకు వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ, టీకా వేసుకోవాలని ఎవరు ఇక్కడికి పంపించారు, అధికారులు చెప్పారా, స్వయంగా తెలుసుకొని వచ్చావా అని ఆరా తీశారు. తమకు పంచాయితీ సెక్రెటరీ, తన కొడుకు చెప్పడం వలన వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చానని తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు వ్యాక్సిన్ సెంటర్ లో సెల్ నంబర్ ను ప్రజలకు కనపడే విధంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. మండలంలోని హాబిటేషన్ లలో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలను ఎంపీడీఓ ను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నందున ఏ ఒక్కరు కూడ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండకూడదని, అందుకు ఇంటింటికి టీమ్ వెళ్లి పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం బెల్లూరి గూడా గిరిజన గ్రామానికి వెళ్లి గ్రామంలో అర్హత గల వారు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది వ్యాక్సిన్ తీసుకున్నారు అనే విషయాన్నీ పంచాయితీ కార్యదర్శిని కలెక్టర్ అడిగారు. గ్రామంలో అర్హత గలవారు 144 ఉండగా 125 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, సోమవారం ఒక్కరోజునే 113 మంది వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని, మిగితా వారు అనారోగ్య కారణాల వలన తీసుకోలేక పోయారని వారికీ త్వరలో వ్యాక్సిన్ ఇప్పించడానికి ప్రతిపాదించడం జరిగిందని పంచాయితీ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ జరగడం అబినందనీయమని మిగిలి పోయిన వారికీ కూడా వ్యాక్సిన్ తప్పని సరిగా ఇప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, ఎంపీడీఓ గజానంద్, తహసీల్దార్ మహేంద్రనాథ్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయసారథి, మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య, మెడికల్ ఆఫీసర్ డా.దీపికా, మండల పంచాయితీ అధికారి, సర్పంచ్ లు దేవన్న, రమిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post