వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

ప్రచురణార్థం….1
సెప్టెంబర్ 30 వరకు 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి, సెప్టెంబర్ 23:
జిల్లా లో సెప్టెంబర్30 వరకు 100% కోవిడ్ వ్యాక్సిన్ అందించే దిశగా పని చేస్తున్నామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కోన్నారు. గురువారం పెద్దపల్లి మున్సిపాలిటీ లోని 14వ వార్డుల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో ఇప్పటి వరకు70% పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేసామని తెలిపారు. గ్రామంలో,పట్టణంలో ప్రతి ఇంటింటికి వార్డుల వారిగా వ్యాక్సిన్ సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సిన్ పై అపోహలు ఉన్నవారికి అవగాహనను కల్పించి వారు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ పేర్కోన్నారు . వ్యాక్సిన్ కొరకు కేంద్రాల వద్దకు ప్రజలు ఎక్కువమంది వచ్చినట్లయితే, ఇబ్బందులు కలుగకుండా రిజిస్ట్రేషన్ కొరకు ఇతర సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో సెప్టెంబర్30 వరకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తికావాలని అధికారులను అదనపు కలెక్టర్ అదేశించారు

పర్యటన లో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post