వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయాలి:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

ప్రచురణార్థం-2
జనగామ డిసెంబర్ 21: వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఒకటి, రెండవ వార్డులలో నివసిస్తున్న సంచార జాతుల వారికి వేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని మొదటి, రెండవ డోసులు తీసుకొని వారిని గుర్తించి ప్రతి ఇంటికి తిరుగుతూ వ్యాక్సిన్ చేపట్టాలని అందుకు వార్డ్ ప్రత్యేక అధికారులు మల్టీ డిసిప్లినరీ కమిటీలు అహర్నిశలు పనిచేసి వ్యాక్సినేషన్ నూరు శాతం లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక క్యాంపులలో ఏ రోజు వ్యాక్సిన్ ఆ రోజే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకొని వారు స్వచ్చంధంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డా. పి. సుగుణాకర్ రాజు, వార్డు ప్రత్యేక అధికారిణి రోజారాణి, వైద్యసిబ్బంది రమాదేవి,అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post