వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలి…

ప్రచురణార్ధం

వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలి…

మహబూబాబాద్ అక్టోబర్ 26.

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వైద్య అధికారులతో జిల్లా అధికారులతో మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక బద్దంగా కృషి చేయాలన్నారు.

కళాశాలలలోని విద్యార్థులు ఓటరు జాబితా పెన్షనర్లు గర్భిణీ మహిళలు నివేదికలు తీసుకోవాలని సబ్ సెంటర్ల పరిధిలో హ్యా బిటేషన్ ల వారీగా పరిశీలన కార్యక్రమం చేపట్టాలన్నారు.

మొదటి డోసు తీసుకున్న నివేదిక ఆధారంగా రెండవ డోసు పూర్తి చేయాలన్నారు మరిపెడ తొర్రూరు డోర్నకల్ కేసముద్రం గూడూరు నెల్లికుదురు 6 మండలాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా చేపట్టి ప్రతిరోజు ఆరు వందల మందికి వ్యాక్సిన్ వేయాలన్నారు. మల్యాల డోర్నకల్ కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలన్నారు వైద్యాధికారులు మండల స్థాయి అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆఫ్లైన్ డాటాను ఆన్లైన్ చేయాలన్నారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు డి ఆర్ డి ఎ పిడి సన్యాస య్య తదితరులు పాల్గొన్నారు
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post