వ్యాక్సినేషన్ పై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్,ZP CEO ప్రియాంక.

పత్రికా ప్రకటన తేదీ: 23-11-2021
కరీంనగర్

కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి

ఉపాధి హామీ కూలీల శాతం పెంచాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్
00000

జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కోవిడ్ వ్యాక్సినేషన్, ఉపాధి హామీ కూలీలు, హరితహారం, నర్సరీలు తదితర అంశాలపై ఎంపీడీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంకతో కలిసి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవోలు, తహసీల్దార్లు సమన్వయం చేసుకొని ఇంటింటి సర్వే చేస్తూ కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. మొదటి డోస్ తీసుకున్న వారికి, తప్పని సరిగా రెండో డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని అన్నారు. మొదటి డోస్ తీసుకున్నవారు, రెండవ డోస్ తీసుకునే గడువు ముగిసిన వారిని గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. అవసరమైన చోట వైద్య బృందాలను విరివిగా ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ ఇప్పించాలని అన్నారు. కోవిడ్ ప్రమాదం పూర్తిగా తొలగిపో లేదని, నిర్లక్ష్యం చేయకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునెలా చూడాలని సూచించారు. కోవిడ్ తో మరణించిన వారి సంబంధీకులు మీ సేవలో దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని, కోవిడ్ మరణాలకు ప్రభుత్వం .రూ 50000/- ఎక్సుగ్రేషియా ఇస్తుందని తెలిపారు. గ్రామాలలో సబ్ సెంటర్లకు స్థలాలను గుర్తించాలని తహసిల్దార్ లను ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన స్థలాలలో సబ్ సెంటర్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ కూలీల శాతం పెంచి వారికి పనులు కల్పించాలని ఎంపీడీవో లను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఫీడర్ చానల్స్, కెనాల్స్ శుభ్రం చేయించాలని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్న వారందరితో పనులు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బృహత్ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలలో పనులు చేయించాలని అన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. అవకాశం ఉన్న చోట పెసర్లు, మినుములు, నువ్వులు, కందులు లాంటి పంటలు వేసుకునేలా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారి కి సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డి ఆర్ డి ఓ శ్రీలత, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్ డి వో లు ఆనంద్ కుమార్, సిహెచ్. రవీందర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ జువేరియా, జిల్లా వ్యవసాయ అధికారి వి.
శ్రీధర్, అన్ని మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post