వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి::జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి::జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ నవంబర్ 01 : సోమవారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ను మండల ప్రత్యేక అధికారులు, మల్టీ డిసిప్లీనరీ కమిటీ తో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి మిగిలి ఉన్న లక్ష్యాలను పూర్తి చేయాలని, వ్యాక్సినేషన్ లో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి అధిక సమయం కేటాయించి ప్రతి ఇల్లును వదలకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేసే విధంగా చర్యలు చేపట్టి ఈ నెల 3 వ తేది లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అనంతరం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో జాఫర్ ఘడ్ మండలంలోని నమిలిగొండ, తిమ్మంపేట, చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ను స్వయంగా పరిశీలించి సిబ్బందిని వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ. మహేందర్ డిఆర్డీఓ జి. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post