వ్యాక్సినేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

ప్రచురణార్థం-1
వ్యాక్సినేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్.
బుధవారం జనగామ పట్టణంలోని 30 వ వార్డు వ్యాక్సిన్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డులోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. వాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కె. నరసింహా,
ఉప వైద్యధికారిణి డా. కరుణశ్రీ, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, వార్డ్ ఆఫీసర్ రవీందర్, వార్డ్ కౌన్సిలర్ బి. శ్రీనివాస్, అంగన్ వాడీ, ఆశా వర్కర్, విఆర్ఏ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post