*వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 8: వ్యాక్సినేషన్ లక్ష్యం వంద శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఏఎన్సి చెకప్, ఇమ్యునైజేషన్ లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 4 లక్షల 22 వేల 182 వ్యాక్సినేషన్ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3 లక్షల 79 వేల 149 మం మొదటి డోస్, లక్షా 56 వేల 7 రెండో డోసులు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. నిర్ణీత సమయం మేరకు రెండో డోసు వారికి వ్యాక్సిన్ ఇస్తూనే, ఇంకనూ మొదటి డోస్ తీసుకొనని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. ఏఎన్ఎం లకు లక్ష్యం ఇచ్చి, పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో గత వారంలో 209 డెంగ్యూ పరీక్షలు చేపట్టగా, 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇమ్యునైజేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఏఎన్సి పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వంద శాతం జరగాలని, ప్రసవం వరకు కేసులను పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ తెలిపారు. మెరుగైన సేవలు అందించి, ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలన్నారు.
ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, ప్రోగ్రామ్ అధికారి డా. శ్రీరాములు, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, మండల వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post