వ్యాక్సినేషన్ లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

పత్రికాప్రకటన                                                                                                                                      తేదిః 26-01-202
 కరీంనగర్
 వ్యాక్సినేషన్ లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమం
ప్రజల ఆరోగ్యమే  ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల  కమలాకర్

వ్యాక్సినేషన్ లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమం
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

  • రెండవ డోస్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందున ఘనంగా వేడుకలు
  • కేక్ కటింగ్, మిఠాయిల పంపిణి,
  • లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తిచేసిన 5 ప్రాథమిక అరోగ్య కేంద్రాలకు రూ. లక్ష చోప్పున స్వంత  నిధులతో  బహుమతులను అందజేసిన మంత్రి
  • వైద్యులకు, అధికారులకు సన్మానాలు, జ్ఞాపికలు, ప్రశంస పత్రాల అందజేత.
00000

ప్రజల అరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని   రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బుధవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సినేషన్ ను 100.19 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందున నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. 2001 సంవత్సరంలో సింహగర్జనను కేసిఆర్ కరీంనగర్ లోనే ప్రారంభించిన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.   కాళేశ్వరం జలాలతో నేడు రాష్ట్రంలో  కోటి ఎకరాలకు పైగా సాగు అవుతుదని పేర్కోన్నారు.  2014 సంవత్సరంలో కేసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కరీంనగర్ సిటీ రినోవేషన్ (అభివృద్ది) పథకాన్ని ప్రారంభించారని మంత్రి తెలిపారు.   మొదటి జి.ఓ తో కేసిఆర్ రూ. 92 కోట్లను విడుదల చేయగా నగరంలో రోడ్లను అభివృద్ది చేశామని అన్నారు.  గతంలో కరోనా అనగానే భయపడ్డ కరీంనగర్ నేడు కరీంనగర్ ను చూసి కరోనా భయపడే స్థాయికి చేరిందని అన్నారు.  వైద్య సిబ్బంది, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెండవ డోస్ వ్యాక్సినేషన్ ను 100శాతం పూర్తిచేయడం అభినందనీయమని అన్నారు.  ఇదే క్రమంలో 3వ దశ కోవిడ్ ను కూడా కట్టడి చేసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.   ఈ విజయం కేసిఆర్ కే అంకితం చేస్తున్నామని మంత్రి తెలిపారు.   కోవిడ్ కు భయపడవద్దని దైర్యమే మందుగా భావించి ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు.  ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ  మొదట్లో కరోనా వల్ల కార్మికులు ఉధ్యోగాలు పోగోట్టుకొని అనేక కష్టాలు పడ్డారని ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కోక్కరికి 6కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించి  ఆదుకున్నారని తెలిపారు.  మూడవ దశ కరోనాను ఎదుర్కోనేందుకు ప్రజలందరు తప్పనిసరిగా మాస్కులు దరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్సి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు కేటిఆర్, హారీష్ రావు, గంగుల కమలకార్ సూచనలతో జిల్లా కలెక్టర్, వైద్య సిబ్బంది వివిధ శాఖల సమన్వయంతొ 2వ డోస్ వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తిచేసినందున వారికి అభినందనలు తెలిపారు.  2వ డోస్ వ్యాక్సినేషన్ 100శాతం పూర్తిచేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారతంలో 2వ స్థానం, దేశంలో 4వ స్థానంలో నిలిపినందుకు  అధికారులకు దన్యవాదనలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ  జిల్లాలో మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ను 104శాతం, 2వ డోస్ ను 100.19 శాతం పూర్తిచేశామని తెలిపారు. 15 నుండి 17 సంవత్సరాల వయస్సుగల యువతకు 72.46శాతం, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ 34.47శాతం పూర్తిచేశామని తెలిపారు.   కరీంనగర్ అర్బన్ లో మున్సిపాలిటి నుండి 100 బృందాలు, కొత్తపెల్లి మున్సిపాలిటి నుండి 15 బృందాలు, చోప్పదండి మున్సిపాలిటి 15 బృందాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటిల నుండి 30 బృందాల చోప్పున ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తిచేశారని అన్నారు.  జ్వరంతో బాదపడే వారిని గుర్తించి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి, కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఔషద కిట్లు అందించారని తెలిపారు.  ప్రతి బృందంలో వైద్య సిబ్బంది, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు, యంపిడిఓలు, యంపిఓ లు,  గ్రామ కార్యదర్శుల సమన్వయంతో పని చేసి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని విజయ వంతంగా పూర్తిచేశారని పేర్కోన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నగదు బహుమతులు అందించిన మంత్రి..

జిల్లాలో కోవిడ్ మొదటి డోస్, రెండవ డోస్ వ్యాక్సినేషన్ లను వేగవంతంగా పూర్తిచేసిన కరీంనగర్ నగరంలోని  బుట్టిరాజారాం కాలని అర్బన్ ప్రాథమిక అరోగ్య కేంద్రం, గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకరపట్నం, సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బృందాలకు రాష్ట్ర బిసి  సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన స్వంత డబ్బులతో ఒక్కొక్క పి.హెచ్.సి కి  రూ. లక్ష చోప్పున చెక్కులను అందజేశారు. బృందానికి జ్ఞాపిక, బృందం సభ్యులకు ప్రశంస పత్రాలను అందజేశారు. రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తిచేయడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. జువేరియాను, జిల్లా పంచాయతి అధికారి వీరబుచ్చయ్య, సంక్షేమ అధికారి పద్మావతి జిల్లా ఉప వైద్యాధికారులను, తదితరులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంధలయ సంస్థ చైర్మన్ ఎనుగు రవీందర్ రెడ్డి,  డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి,  వివిధ శాఖల అధికారులు  లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు,  కార్పోరేటర్లు తదితరులు పాల్గోన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, కరీంనగర్ వారిచే జారి చేయనైనది.

Share This Post