వ్యాక్సినేషన్ లో రోజువారీ ప్రగతి కనిపించాలి….

ప్రచురణార్ధం

వ్యాక్సినేషన్ లో రోజువారీ ప్రగతి కనిపించాలి….

మహబూబాబాద్, నవంబర్,30.

జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రగతి రోజువారీ కనిపించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయం ప్రజ్ఞ సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్, రక్త పరీక్షల నమూనాలు సేకరణ, సబ్ సెంటర్లకు విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ కనెక్షన్ లు తదితర అంశాలపై కలెక్టర్ వైద్యాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా కనుగుణంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని 100 శాతం పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలన్నారు. ప్రతి రోజు వ్యాక్సినేషన్ ప్రగతి కనిపించాలని, వైద్యాధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు.

రక్త పరీక్షలకు నమూనా సేకరణలో ప్రతి రోజు 400 నమూనాలు సేకరించి పంపాలన్నారు. పి.హెచ్.సి 20, సి.హెచ్.సి.30 నమూనాలు సేకరించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ఉప వైద్య అధికారి అంబరీష విద్యుత్ అధికారి సునీత దేవి మిషన్ భగీరథ అధికారి పి హెచ్ సి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post