వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తికి ప్రజలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తికి ప్రజలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 9: మొదటి, రెండవ డోస్ ల కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తికి ప్రజలు సహకరించాలని, అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకుని సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం కలెక్టర్ తంగళ్ళపల్లి మండలం సారంపెల్లి, ఇందిరమ్మ కాలనీ, ఓబులాపూర్ గ్రామాల్లోని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, అర్హులైన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. మొదటి డోస్ తీసుకుని, రెండవ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితాను సేకరించి అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఓబులాపూర్ గ్రామంలో ఇప్పటివరకు 763 మందికి మొదటి డోస్, 130 మందికి రెండవ డోస్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. సారంపెల్లి గ్రామంలో ఇప్పటివరకు 990 మందికి మొదటి డోస్, 242 మందికి రెండవ డోస్ వేయడం జరిగిందని సిబ్బంది వివరించారు. అనంతరం ఓబులాపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ను సందర్శించి, అందులో నాటిన మొక్కల వివరాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నాటిన అన్ని మొక్కలను సంరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

*ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు :: జిల్లా కలెక్టర్*

ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు వస్తాయని, వరిని సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం ఆయన తంగళ్ళపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 102 మంది రైతుల వద్ద నుండి 4 వేల 934 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, ఆ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ కు సిబ్బంది వివరించారు. స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడిన కలెక్టర్ ఈ యాసంగిలో భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేయనని స్పష్టం చేసినందున, ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని, రైతులెవరూ వరి పండించి నష్టాల పలు కావద్దని సూచించారు. ప్రభుత్వం, అధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలను సాగు చేసి లాభం పొందాలని అన్నారు.
అంతకముందు కలెక్టర్ సారంపెల్లి గ్రామంలోని రైస్ మిల్లును తనిఖీ చేసి, ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం అన్ లోడింగ్ లో వేగం పెంచాలని రైస్ మిల్లు నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, ఎంపీడీఓ లచ్చాలు, తదితరులు ఉన్నారు.

Share This Post