వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్ధం-2
జనగామ డిసెంబర్ 15: వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సిన్ పై మండల ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో మొదటి డోసు వ్యాక్సినేషన్ ను మూడు రోజులలోగా పూర్తి చేసే విధంగా ఎంపిడిఓలు, తహసిల్దార్లు ప్రతి రోజు మండలంలోని ప్రతి గ్రామాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బందిని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టి డిసెంబరు చివరిలో గా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.అదేవిధంగా రెండవ డోసుకు అర్హత కలిగిన వారికి వ్యాక్సినేషన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు ఎప్పటికప్పుడు అధికారులు వారి వారి మండలాల వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును ఏ రోజు నిర్దేశించిన టార్గెట్ ను ఆ రోజు పూర్తి చేయాలని అన్నారు. నిర్దేశించిన టార్గెట్లను త్వరగా పూర్తి చేసి గ్రామాల వారీగా, మండలాల వారీగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్,జిల్లా వైద్యాధికారి డా.ఏ. మహేందర్, జెడ్పీ సీఈవో ఎల్.విజయలక్ష్మీ, డా.కరుణశ్రీ, ఎంపిడిఓలు, తహసిల్దార్లు, మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post