వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేస్తాం…

ప్రచురణార్ధం

వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేస్తాం…

మహబూబాబాద్, నవంబర్,13.

వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు ప్రణాలిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలియజేశారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వైద్య శాఖ పనితీరు మెరుగు, వంద శాతం వ్యాక్సినేషన్, మెడికల్ కళాశాలల పై హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ‌ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నివేదిస్తూ జిల్లాలో కోవిడ్ 19 క్రింద చేపడుతున్న వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు మొదటి విడత ఫస్ట్ డోస్ గా 4.96 లక్షల మందికి 89శాతంగా ఇవ్వడం జరిగిందని, 2వ డోస్ ను 2 లక్షల 9వేల మందికి ఇచ్చి 42శాతంగా ఉన్నామన్నారు.

461 గ్రామపంచాయతీలకు గాను 200 గ్రామపంచాయతీలో పూర్తి చేశామన్నారు.

మెడికల్ కళాశాల పనులను వివరిస్తూ పనులు వేగవంతం గా జరుగుతున్నాయన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి లో అదనపు పడకల నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, సమస్యలు లేవని మెడికల్ కళాశాల పనులలో పుటింగ్ స్టేజి పనులు చేపట్టామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య సేవలో జవాబుదారితనం పెంచాలన్నారు వైద్యశాలను నిరంతరం తనిఖీ చేయాలని వైద్య సిబ్బంది నియామక అధికారాలను కలెక్టర్లకు అప్పగించామన్నారు. ప్రజల్లో ప్రభుత్వం వైద్యం పట్ల నమ్మకాన్ని పెంచాలని మంత్రి సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 10 వేల కోట్లు ఆరోగ్యం కొరకు కేటాయించినట్లు తెలియజేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు చేరే విధంగా వైద్యాధికారులు శాంపిల్స్ లక్ష్యాలను పెంచాలన్నారు.
హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని సర్జరీలు చేపట్టాలన్నారు ఓ పి పెరగాలని తెలియజేశారు శానిటేషన్ ప్రధానమని మెరుగు పరిచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు వైద్య అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆస్పత్రులలో అందించే భోజనాల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు అదేవిధంగా బాత్రూం లు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యశాల పనితీరుపై రోగులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు మలేరియా టిబి లెప్రసి బ్లైండ్నెస్ వంటి నాలుగు అంశాలపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు ఆర్ బి హెచ్ కె వాహనాలు వినియోగించుకొని వైద్య సేవలను అందించాలన్నారు జిల్లాల లో పర్యటిస్తానని సేవలు బాగుంటే అవార్డులు అందిస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారి హరీష్ రాజు ఇంజనీరింగ్ అధికారులు ఆర్ అండ్ బి తానేశ్వర్, టి ఎస్ ఎమ్ ఐ డి సి ఉమా మహేష్ టీఎస్ ఐ ఐ సి జోనల్ మేనేజర్ రతన్ rathod డిప్యూటీ జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post