*వ్యాక్సినేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ సి హెచ్.శివలింగయ్య

*వ్యాక్సినేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ సి హెచ్.శివలింగయ్య

జనగామ అక్టోబర్ 28:
వ్యాక్సినేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు.
గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు గ్రామ స్థాయిలో వ్యాక్సినేషన్ టీం సభ్యులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ రోజు పరిశీలించిన వ్యాక్సినేషన్ మండల పరిధిలో గ్యాప్ వచ్చిందని ఆయన అన్నారు. కావున అందరూ కలిసి ప్రతి మండలానికి మొదటి డోస్ క్రింద 10 వేలు వ్యాక్సిన్లు కేటాయించామని ప్రతి గ్రామానికి ఎన్ని డోసులు వేయాలో మండల ప్రత్యేక అధికారులు నిర్ణయం తీసుకుని ప్రణాళిక సిద్ధం చేసి ప్రక్రియ అంతా కలిసి ఎలాంటి సమన్వయం లోపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంప్ లో వారికి కేటాయించిన విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించిన మండల ప్రత్యేక అధికారులు, టీం సిబ్బంది పై చర్యలు తీసుకుంటమని కలెక్టర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితుల్లోను నవంబర్ 3 లోగా వంద శాతం లక్ష్యంగా పెట్టుకొని పని చేయుటకు కలెక్టర్ అదేశించారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్ రావు,అబ్ధుల్ హమీద్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎ. మహేందర్, జెడ్పీ సీఈవో, ఎల్. విజయ లక్ష్మి, డిఆర్డిఓ, రాంరెడ్డి, డిపిఓ.రంగాచారి, ఉప వైద్యఅధికారిణి డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ రాము, చాయాదేవి, మండల ప్రత్యేక అధికారులు, పాల్గొన్నారు
——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జనగామ చే జారీ చేయ నైనది.

Share This Post