వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి* *డిసెంబర్ చివరి వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

నల్గొండ,డిసెంబర్ 1.జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డిసెంబరు చివరి వరకు  వంద శాతం పూర్తి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సూక్ష్మ ప్రణాళిక రూపొందించి వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ పై సమీక్షించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోస్ 91 శాతం పూర్తి చేసి రాష్ట్ర సరాసరి శాతం పైన ఉందని అన్నారు.జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా పూర్తి చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,సిబ్బంది ని జిల్లా కలెక్టర్ అభినందించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి డోస్ వేసుకోని వారిని,మొదటి డోస్ వేసుకొని రెండవ డోస్ కు ఎదురు చూస్తున్న వారిని గుర్తించి వంద శాతం డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయాలని అన్నారు.ఇందుకు మొదటి డోస్ పూర్తి అయి రెండవ డోస్ కు ఎదురు చూస్తున్న వారికి  వ్యాక్సిన్ రెండవ డోస్ వేసేందుకు  సబ్ సెంటర్,గ్రామ హ్యాబిటేషన్ వారిగా మ్యాపింగ్ చేస్తూ సూక్ష్మ ప్రణాళిక రూపొందించి వారం వారీగా విభజించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు.గురువారం డిప్యూటీ వైద్య శాఖ అధికారులు తమ పరిధి లోని డాక్టర్ లతో సమావేశం జరిపి వ్యాక్సినేషన్ ప్రణాళిక రూపొందించి పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామ వారీగా బృందాలు ఏర్పాటు చేసి లక్ష్యం నిర్ణయించి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అన్నారు.జిల్లా వైద్య అధికారి, డిప్యూటీ వైద్య అధికారి గ్రామాలను సందర్శించి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి గ్రామం,మండలం లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు.జిల్లాలో 12,07,615 లక్ష్యం కు 10,86,314 మందికి మొదటి డోస్ పూర్తి అయిందని, రెండవ డోస్ 3,96,415 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు వివరించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపతి, డిప్యూటీ వైద్య అధికారులు డా.వేణు గోపాల్, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు

వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి*
*డిసెంబర్ చివరి వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

Share This Post