వ్యాక్సినేషన్ సరళిని పరిశీలించిన:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 22: శుక్రవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య చిల్పుర్ మండలం మల్కాపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ సరళిని కలెక్టర్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న ప్రక్రియ 100 శాతం సజావుగా సాగేందుకు వీలుగా సమిష్టి కృషితో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నయని
ఇంకా క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోని వారిని స్థానిక కమ్యూనిటీ హెల్త్,గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా గుర్తించి వారికి వెంటనే వ్యాక్సిన్ చేయాలని కలెక్టర్ అదేశించారు.
జిల్లా వ్యాప్తంగా కేటాయించిన లక్ష్యo దిశగా పని చేయుటకు మండల ప్రత్యేక అధికారులు, వ్యాక్సినేషన్ నోడల్ అధికారులు వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ. మహేందర్, డాక్టర్ రాము, ఎంపిడిఓ.వేణుగోపాల్, తసిహిల్దర్ యాదన్న, స్థానిక సర్పంచ్ రవి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జనగామచే జారీ చేయనైనది.

Share This Post