వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించిన చీఫ్ విప్,మేయర్

మహా నగరపాలక సంస్థ పరిధి లోని 61 వ డివిజన్ సిద్దార్థ నగర్ కమ్యూనిటీ హాల్ లో గురువారం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జిడబ్లుఎంసి కమీషనర్ ప్రావీణ్య లతో కలసి
ప్రారంభించారు.

అనంతరం ఆయన మేయర్, కమిషనర్ లతో సిద్దార్థ నగర్ లో క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి వాక్సినేషన్ వేయుంచుకోవాలని అవగాహన కల్పించారు. వాక్సినేషన్ సంబంధిత సమాచారాన్ని తెలిపే స్టిక్కర్స్ ను ఇంటి ముందు భాగం లో అతికించి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రజలలో అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని అన్నారు.

కార్పొరేషన్ పరిధి లోని 66 డివిజన్ లలో ఈ నెల 16 నుండి 10 రోజుల పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్స్ వేయించే కార్యక్రమం జరుగుతున్నదని అన్నారు. ప్రత్యేక ఆరోగ్య బృందాలచే అన్ని డివిజన్లలోని ఇంటింటికీ వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ పై సర్వే నిర్వహించి వ్యాక్సిన్లు వేసుకొని వారిని గుర్తించి 100% వ్యాక్సినేషన్ వేయడమే లక్ష్యం గా 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయింస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎలుకంటి రాములు, డిప్యూటీ డి.ఎం& హెచ్.ఓ.డా.మదన్ మోహన్ రావు, డా.హిమ బిందు, సి.ఓ.ఎన్. శ్రీలత,సూపర్ వైజర్ విప్లవ్ కుమార్ తో పాటు స్థానికులు బాబా,హరికృష్ణ,రమేష్,శ్రావణ్, వెంకట స్వామి,విజయ్,వెంకట లక్ష్మీ,రమ,సీత, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Post