వ్యాక్సినేషన్ 100% పూర్తయ్యేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.

ప్రచురణార్థం

వ్యాక్సినేషన్ 100% పూర్తయ్యేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.

మహబూబాబాద్ డిసెంబర్ 1.

వ్యాక్సినేషన్ 100% పూర్తయ్యేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికి తిరిగి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మున్సిపల్ చైర్మన్లు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సిన్ మొదటి డోస్ కార్యక్రమంకు గాను 5.63 లక్షల మంది ఉండగా, 5.12 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి 91.3 శాతంతో ఉన్నామన్నారు ఇంకనూ సుమారు 50 వేల మంది మొదటి డోసు తీసుకొని వారిని గుర్తించి స్పెషల్ డ్రైవ్ లో తప్పనిసరిగా వేయాలన్నారు.

రెండవ డోస్లో 81% పూర్తయిందని ఇంకనూ 58వేల మంది వ్యాక్సిన్ వేసుకునేవారు 19 శాతం ఉన్నారని స్పెషల్ డ్రైవ్ లో పూర్తి చేయాల్సి ఉందని అన్నారు.

తొర్రూరు మరిపెడ ఇనుగుర్తి లలో వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉన్నందున మున్సిపల్ కమిషనర్లు అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

ఓటర్ల నివేదిక ప్రకారంగా జిల్లాలో 6.25 లక్షల మంది 18 సంవత్సరాలు దాటిన ఓటర్లు ఉన్నారని ఓటర్ లిస్టు ప్రకారంగా వ్యాక్సినేషన్ లిస్టును సరి చూసుకోవాలన్నారు గర్భిణీ స్త్రీలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అంగన్వాడీలకు బాధ్యత అప్పగించామన్నారు. రెండవ డోసు వ్యాక్సినేషన్ లో పేరుతో సహా వివరాలు ఉన్నాయని తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయాలన్నారు 461 గ్రామ పంచాయతీలలో 368 గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు 93 గ్రామాలు మాత్రమే మిగిలి ఉన్నందున పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు గ్రామైక్య సంఘాలతో వసతి గృహాలలో సంక్షేమ అధికారులు రీజినల్ కోఆర్డినేటర్లు సహకారంతో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయించాలన్నారు జిల్లాలో 173 సబ్ సెంటర్లు ఉన్నాయని వైద్య సిబ్బంది ఎంపీటీసీలు జెడ్ పి టి సి లు సహకారంతో ప్రతిరోజూ ఉదయమే గ్రామాలలో పర్యటించి వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు.

వ్యాక్సినేషన్ పూర్తిగాని బేతవోలు, కంకర బోర్డు, కృష్ణ కాలనీ, అంబేద్కర్ కాలనీ లలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అందించాలని అధికారులు సిబ్బందితో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.

మరిపెడ మున్సిపల్ పరిధిలో మూడు తండాలు ఉన్నాయని 341 మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని 236 మృతుల వివరాలు కూడా ఉన్నాయని మొత్తంగా 577 నివేదిక ఉందన్నారు. వ్యాక్సినేషన్ రెండవ డో స్లో మిగిలిన 58 వేల లో ఆరు వేల మంది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి నివేదిక ఉందన్నారు త్వరిత గతిన పూర్తి చేయాలని ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకులు వెంకట రాములు ను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మహబూబాబాద్ మరిపెడ మున్సిపల్ చైర్మన్లు పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సింధూర జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట రాములు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post