వ్యాక్సిన్ తీసుకున్న ప్రతిఓక్కరి వివరాలు కోవిన్ యాప్ లో రిజిష్టర్ కావాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం.. 1 తేదిః 02-12-2021
వ్యాక్సిన్ తీసుకున్న ప్రతిఓక్కరి వివరాలు కోవిన్ యాప్ లో రిజిష్టర్ కావాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 02: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఓక్కరి వివరాలు కోవిన్ యాప్ లో రిజిష్టర్ అయి ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ విధానంపై వైద్యఅధికారులు, మేడిపల్లి, పెగడపల్లి, మెట్పల్లి మరియు మల్యాల మండలాల సర్పంచులు పంచాయితి సేక్రటరీ లతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 20వేల మందికి కోవిడ్ 1st డోస్ వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉందని వారందరికి వ్యాక్సిన్ ఇప్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని అన్నారు. మీ గ్రామంలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కోవిన్ యాప్ లో నమోదు కాని వారిని గుర్తించి వారి ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆదారాలను పరిశీలించి వారి వివరాలను రిజిష్టర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ ప్రచార సాధనాల ద్వారా వింటున్న ఓమైక్రాన్ వైరస్ ప్రబావం ప్రస్తుతం మన దగ్గర లేనప్పటికి, కరోనా మొదటి విడతలో పాటించిన విదంగా మాస్కులు దరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, విదేశాల నుండి వచ్చిన వారు హోంక్వారంటైన్ పాటించడం, మొదలగు జాగ్రత్తలు పాటించడం జరిగిందో, అదే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతిఓక్కరికి రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ లను అందించాలన్న లక్ష్య్రంగా ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది, ఇంకా వ్యాక్సిన్ ఎంతమందికి ఇవ్వాలి, వ్యాక్సిన్ పొంది ఫోర్టల్ లో రిజిష్టర్ కాని వివరాలను డోర్ టు డోర్ సర్వే ద్వారా గుర్తించాలని, మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని గుర్తించి వారికి రెండవ విడత వ్యాక్సిన్ అందించాలని అన్నారు.
ఓటరు జాబితా ఆధారంగా వ్యాక్సిన్ అందించేలా చూడడం జరుగుతుందని, ఓటరు జాబితాలో పేర్లు లేని 18 సంవత్సరాల నిండి ఓటరుగా నమోదు కాని వారిని, వ్యవసాయ, వ్యాపారం ఇతర పనులు నిమిత్తం వచ్చిన వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందజేయాలని సూచించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వాహనాల ద్వారా అవగాహన కల్పించాలని, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతిఓక్కరి వివరాలు కోవిన్ యాప్ లో రిజిష్టర్ కావాలని, వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తిచేసి 100% వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రకటించాలని అన్నారు. వ్యాక్సిన్ వైద్యాధికారుల ఆదేశాల మేరకు నిర్దిష్ట సమయాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలి, అరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. సర్పంచులు వ్యాక్సినేట్ అయిన వివరాలను క్రాస్ చెక్ చేయాలని, కుటుంబ సభ్యులు మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నట్లయితేనే వారిని రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుందని, వ్యాక్సిన్ తీసుకోమనె వారికి మత్తపెద్దల ద్వారా అవగాహన కల్పించి వారికి వ్యాక్సిన్ ఇప్పించాలని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో ప్రతి ప్రాథమిక కేంద్రం వారిగా వ్యాక్సినేషన్ విధానాన్ని పై అధికారులు పరిశీలిస్తున్నందున, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుని, కోవిన్ యాప్ లో రిజిష్టర్ అయ్యేలా చూడాలని అన్నారు. డోర్ టు డోర్ సర్వే లను నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించడం, అన్ని విధాల జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువ శ్రద్ద వహించాలని తెలియచేసారు
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, జిల్లా వైద్యాధికారి డా. పి. శ్రీధర్, ప్రత్యేకాధికారులు, యంపిడిఓలు, యంపిఓ లు మేడిపల్లి, పెగడపల్లి, మెట్ పల్లి, మల్యాల మండలాల సర్పంచులు, పంచాయితి సెక్రటరిలు పాల్గోన్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న ప్రతిఓక్కరి వివరాలు కోవిన్ యాప్ లో రిజిష్టర్ కావాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post