వ్యాక్సిన్ పై అపోహలు వీడి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. 10 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామీణ, మున్సిపాలిటీలలో ప్రజల నుండి చక్కటి స్పందన వస్తున్నదని అభినందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వేలో వాక్సిన్ తీసుకున్న కుటుంబాల గృహాలకు స్టిక్కర్ అంటించాలని చెప్పారు. వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసిన గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నూరు శాతం పూర్తి చేసినట్లు ప్రకటించాలని చెప్పారు. గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు సహకారం అవసరమని ఆయన చెప్పారు. వాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన కల్పనకు గ్రామ, మున్సిపల్ స్థాయిలో కళాజాత కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిపిఆర్వో ను ఆదేశించారు. జిల్లాలో పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు.

Share This Post