వ్యాక్సిన్ పై అవగహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 09-12-2021
వ్యాక్సిన్ పై అవగహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 09:

వ్యాక్సిన్ పై అవగహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రవి తెలిపారు. గురువారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులు, ప్రత్యేకాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా, కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను మెడికల్ అధికారులు నివృత్తి చేస్తూ వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికను రూపొందించుకోవాలని, 100% వ్యాక్సిన్ లు పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మొదటి విడత, రెండవ విడత వ్యాక్సినే లక్ష్యాన్ని పూర్తిచేయడం లో అధికారులు ప్రణాళికను రూపొందించుకొవాలని, ఉదయం నుండి రాత్రి వరకు వ్యాక్సినేషన్ విధులలో పాల్గోనే సిబ్బందికి బోజనం, ఇతర ఏర్పాట్లను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఒకరోజు ఎంత మందికి వ్యాక్సిన్ అందించడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలుగుతారో గుర్తించాలని సూచించారు.
అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గంజి రోడ్డు, వంజరి వాడ వంజరి సంఘ భవనం మరియు బైపాస్ రోడ్డులో దేవిశ్రీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించి, వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అవలంబిస్తున్న మరియు వ్యాక్సిన్ తీసుకున్నట్లు చేబుతున్న వారి నుండి ఏవిధమైన దృవీకరణల ద్వారా నిర్దారిస్తున్నారు, కోవిన్ యాప్ లో వివరాల పరిశీలన, నమోదు, రిజిస్ట్ర్గేషన్ తదితర విషయాలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి అర్.డి. మాధురి, జిల్లా వైధ్యాధికారి పి. శ్రీధర్, మండలం ప్రత్యేక అధికారి, రాజేశ్వర్, తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

Share This Post