సోమవారం కలెక్టరేట్ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే నిర్వహణకు వినియోగిస్తున్న టీముల సంఖ్యను తగ్గించి వ్యాక్సినేషన్ పై ప్రత్యేక ఫోకస్ చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను జల్లెడపట్టాలని, వ్యాక్సినేషన్కు ప్రతి టీముకు లక్ష్యాన్ని కేటాయించాలని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహణలో కోవిన్ పోర్టల్లో ఆధార్, సెల్ఫోన్ నెంబర్ ద్వారా పరిశీలన చేయాలని, రానున్న 10 రోజులు వ్యాన్సిస్పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందని రొంపేడు వైద్యుడు సమాధానం చెప్పాలని చెప్పగా పొంతన లేని సమాదానాలు చెప్పడం పట్ల వ్యాక్సిన్ వేయాలని ఉందా లేదా ఏంటి మీ ఉద్దేశ్యమని, తనకు ఎందుకు కథలు చెప్తున్నావని, కనీస అవగాహన కూడా లేకుండా పోయిందని, జిల్లా మొత్తం మీద లేని సమస్య మీకొక్కుళ్లకే ఎందుకు వస్తున్నదని షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రత్యేక అధికారి పర్యవేక్షణ కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు కాదు కమిట్మెంట్తో చేస్తే అవుతుందని లైన్ డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేసుకోవాలని, ఉదయమే గ్రామాలకు వెళ్లాలని చెప్పారు. భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారని వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు కాబట్టి పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి టీముకు రోజుకు 100 మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యాన్ని కేటాయించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందంజలో ఉన్న వైద్యాధికారులను అభినందించారు. లైన్ లిస్టు తీసుకుని పంచాయతీ సహాకారం తీసుకుంటే వ్యాక్సిన్ వేయడానికి సులభమవుతుందని చెప్పారు. ప్రోగ్రాం అధికారులు, ఉప వైద్యాధికారులు వారి వారి పరిధిలోని వైద్య సిబ్బందిపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బుధ, శనివారాల్లో వేస్తున్న సాధారణ రోగ నిరోధక టీకాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నామని, ఇతర వ్యాక్సిన్స్ వేయడం పట్ల అశ్రద్ధ వహించొద్దని చెప్పారు. ప్లానింగ్ కమిట్మెంట్ తో ముందుకు వెళ్తే మనముందున్న లక్ష్యాన్ని సాధించగలమని ఆ దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి వారం వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ప్రోగ్రం అధికారి డాక్టర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.