వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో జూమ్ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:12.01.2022, వనపర్తి.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ డోసు వేసుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండవ డోసు పూర్తి కాని వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలలో రోజువారి టార్గెట్ ను పూర్తి చేయాలని, 15 నుండి 17 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆమె తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 84 శాతము వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆమె వివరించారు. గోపాల్ పేట, తిప్పడంపల్లె, వీపనగండ్ల, వనపర్తి వ్యాక్సినేషన్ కేంద్రాలలో లక్ష్యానికి పెండింగ్ ఉన్నట్లు, ఆ ప్రాంతాలపై శ్రద్ధ వహించి లక్ష్యం పూర్తి చేయాలని ఆమె తెలిపారు.
బూస్టర్ డోసు అందించుటకు ఫ్రంట్ లైన్ వారియర్స్ ద్వారా పోలీసు, డి పి ఓ, రెవెన్యూ, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వారందరికీ వ్యాక్సిన్ అందించాలని ఆమె తెలిపారు. రెండు డోసు లు పూర్తి చేసిన 36 వారాలకు (9 నెలలు) బూస్టర్ డోసు అందించుటకు అర్హులని, వారి జాబితాను తయారుచేసి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంచాలని ఆమె అన్నారు. దీని ఆధారంగా రెండు, మూడు రోజుల్లో బూస్టర్ డోసు పూర్తిచేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఆమె సూచించారు. ప్రతి వ్యాక్సినేషన్ సబ్ సెంటర్లలో కోవిడ్ కిట్ లు, వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆమె ఆదేశించారు.
ఈ జూమ్ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post